Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విగ్రహం విలువ కోట్లలోనే : ఆలయ ప్రధానార్చకులు
నవతెలంగాణ-వర్గల్
మండల కేంద్రంలోని అతి పురాతన ఆలయమైన శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయంలో స్వామివారి ఉత్సవ విగ్రహం అపహరణకు గురైంది. శుక్రవారం ఆలయంలోని ప్రధానార్చకుడు మురళీధర్ ఆచార్యులు ఉదయం వచ్చి చూసేసరికి విగ్రహం కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆలయానికి చేరుకొని విచారించి దర్యాప్తు చేస్తున్నారు. విగ్ర హం సుమారు 700 ఏండ్ల పురాతనమైనదని సుమారు 25 కేజీల పంచలోహంతో తయారు చేయబడిందన్నారు. విగ్ర హం విలువ కోట్ల రూపాయలలో ఉంటుందని అంటు న్నారు. గతంలో కూడా రెండుసార్లు విగ్రహం అపహరణకు గురై మళ్లీ దొరికిందని అలాగే ఇప్పుడు కూడా మళ్లీ దొరుకు తుందనే నమ్ముతున్నామని గ్రామస్తులు అంటున్నారు.