Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగదేవపూర్
మండల కేంద్రంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశాన్ని ఎంపీటీసీలు బహిష్కరించారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కిరణ్‌గౌడ్, పీర్లపల్లి ఎంపీటీసీ మహేందర్ రెడ్డిలు మాట్లాడుతూ.. గ్రామ పరిధిలో ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎలాంటి ఆహ్వానం ఇవ్వకుండా ఎంపీటీసీ లేకున్నా కార్యక్రమాలు నిర్వహిస్తు న్నారని ఆవేదన వ్యక్తం చేసారు. సర్వసభ్య సమావేశానికి సర్పంచులు ఎందుకు హాజరు కారని ప్రశ్నించారు. అధికారులు ప్రజా ప్రతినిధులను పట్టించుకోవడం లేదని ఇటిక్యాల సర్పంచ్ రవికంటి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ బాలేషన్ గౌడ్ స్పందిస్తూ.. ఎంపీటీసీలకు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఆహ్వానించక గౌరవించని సర్పంచులను సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్‌కు, స్థానిక మంత్రి హరీశ్‌రావుకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఎంపీపీ బాలశం గౌడ్ వైస్ ఎంపీపీ భగవాన్ డిప్యూటీ తహశీల్దార్ భాస్కర్, ఎంపీడీవో శ్రీనివాస్ వర్మ, ఎంపీటీసీలు, సర్పంచుల పోరం మండల అధ్యక్షులు రాచార్ల నరేష్ గుప్త, సత్యం, అధికారులు ఐకేపీ ఏపీఎం ఆనంద్ కుమార్ మిషన్ భగీరథ ఏఈ తిరుమల్ రెడ్డి, విద్యుత్ అధికారి ఏఈ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు