Authorization
Tue April 08, 2025 03:51:48 am
- ఎమ్మెల్యే రసమయికి వినతి పత్రం అందజేత
నవతెలంగాణ-బెజ్జంకి
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు నిత్యం ప్రథమ చికిత్స చేసే ఆర్ఎంపీ, పీఎంపీలపై ప్రభుత్వ విద్యాధికారుల దాడులను నిలిపివేయాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు శుక్రవారం మండల ఆర్ఎంపీ, పీఎంపీలు వినతిపత్రం అందజేశారు. అలాగే ఆర్ఎంపీ, పీఎంపీలకు శిక్షణా తరగ తులు పూర్తిచేసి.. శిక్షణా నైపుణ్యాల ధ్రువ పత్రాలను అందజేస్తామన్న టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో హామీని పరిశీలించాలని జిల్లా వైద్యాధికారికి వినతిపత్రం అందజే శామని ప్రథమ చికిత్స వైద్యులు తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ఆర్ఎంపీ, పీఎంపీల సంఘం మండలాధ్యక్షుడు తాళ్ల నరసింహ స్వామిని ఎమ్మెల్యే రసమయి శాలువాతో ఆత్మీయ సన్మానం చేశారు.