Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎనిమిదేండ్లుగా ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదు
- సర్పంచులు అప్పులు చేసి పనులు చేస్తే.. అవార్డులు రాష్ట్ర ప్రభుత్వానికా?
- వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
నవతెలంగాణ-జోగిపేట
లక్షల ఎకరాలకు నీళ్లందిస్తామని అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. గత ఎనిమిదేండ్ల కాలంలో ఒక్క ఎకరాకు కూడా నీరందించలేదని.. మంజీరా నీళ్లు మన హక్కు అని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. సర్పంచులు అప్పులు చేసి గ్రామాలభివృద్ధి చేస్తే.. టీఆరర్ఎస్ ప్రభుత్వం అవార్డులను తీసుకోవడం సిగ్గు చేటన్నారు. అటు అవార్డులు ఇచ్చే వాళ్లు, ఇటు తీసుకునేవాళ్లు దొందూ దొందే అని టీఆర్ఎస్, బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రస్థానం పాద యాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం జోగిపేటలో నిర్వహించిన సభలో ఆమె మాట్లాడారు. లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తామని కేసీఅర్ మోసం చేశారన్నారు. మంజీరా నీళ్ళు మన హక్కు అని, 8 ఏండ్లుగా ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదని ఆరోపించారు. ఇప్పుడు స్వఛ్చ అవార్డ్లు వచ్చాయని మురిసి పోతున్నారని, సర్పంచ్‌లు అప్పులు చేసి పనులు చేస్తే సీఎం అవార్డులు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సర్పంచ్ల భార్యలు తాళి బొట్లు అమ్మి పనులు చేస్తే.. మీరు అవార్డులు తీసుకుంటారా అని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నప్పటికీ.. నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఉద్యోగులకు పండుగ పూట జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేని పరిస్థితి దాపురించిందన్నారు. వీఆర్ఏలను పట్టించు కోవడం లేదన్నారు. ప్రతిపక్షాలు కేసీఅర్‌ను ప్రశ్నించి ఉంటే కేసీఅర్ అరాచకాలు కొనసాగేవి కాదన్నారు. అందోల్ నియోజకవర్గానికి సింగూరు ప్రాజెక్ట్ ద్వారా 40 వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన ఘనత వైయస్సార్‌ది అన్నారు.
ఎమ్మెల్యేపై పలు విమర్శలు..
స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌పై షర్మిల మండిపడ్డారు. ఎక్కడ చూసినా కబ్జాలే.. ఎక్కడ ప్రభుత్వ స్థలం కనిపిస్తే జెండా పాతడమే ఆయన నైజమని ఆరోపించారు. దళితుడు అయి ఉండి చెరువులు, అసైన్డ్ భూములు కబ్జా చేస్తున్నార న్నారు. దళిత బిడ్డ అయి ఉండి దళితుల హక్కుల కోసం ఏనాడైనా కొట్లాడాడా అని ప్రశ్నించారు. నేరెళ్ల, మరియమ్మ ఘటనలపై ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. జర్నలి స్ట్‌లకు సైతం న్యాయం చేయలేదన్నారు. జర్నలిస్ట్‌లకు రూ.100 కోట్లు పెట్టి సంక్షేమ నిధి తెస్తామని చెప్పారని.. ఆ హామీ ఏమయిందన్నారు. ఉదయం అల్మాయపేట నుంచి ప్రారంభమైన పాదయాత్ర చింతకుంటకు చేరు కుంది. రాష్ట్ర నాయకులు పిట్టల రామ్‌రెడ్డి, సంజీవరావు, బాలకృష్ణారెడ్డి, వేణు, గోపాలకృష్ణ, ప్రజా గాయకులు ఏపూరి సోమన్న, చం దశేఖర్, జిల్లా నాయకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు.