Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్
నవతెలంగాణ-రేగోడు
త్వరలోనే 85 వేల ఉద్యోగాలు ప్రభుత్వం భర్తీ చేస్తుందని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన రేగోడులో మహిళలకు బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అదేవిధంగా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే 85 వేల ఉద్యోగాలు ప్రభుత్వం భర్తీ చేస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. అందుకోసమే రైతుబంధు, రైతు బీమా, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మితో పాటు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రవేశ పెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి, సుంకె రమేష్ , టీఆర్ఎస్ పార్టీ రేగోడు గ్రామ అధ్యక్షులు రాచోటి సుభాష్, పీఏసీఎస్ చైర్మన్ రాజు యాదవ్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షులు రవీందర్, సర్పంచులు నర్సింలు, సిద్ధారెడ్డి, విజయలక్ష్మి గుర్నాథరెడ్డి, మంజుల నాగయ్య స్వామి, సుమంత వినోద్ కుమార్, ఎంపీటీసీ నర్సింలు, తహసీల్దార్, లక్ష్మణ్, ఎంపీడీవో సీతారావమ్మ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.