Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖరీఫ్ సీజన్లో వర్షాలు సంవృద్ధిగా కురియడంతో వరి సాగు పెరిగింది. ధాన్యం దిగుబడులు పెరగనున్నాయి. ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల గుర్తింపు, గన్నీ సంచుల సేకరణ, మిడిల్ పాయింట్ల గుర్తింపు వంటి పనుల్ని సివిల్ సప్లరు అధికారులు చేస్తున్నారు. వానాకాలం కావడంతో వర్షాల వల్ల నష్టమేర్పడకుండా జాగ్రతలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
- సంగారెడ్డిలో 155... మెదక్‌లో 340 కేంద్రాలు
- 2 కోట్లపైనే గన్నీ సంచులు అవసరం
- ఖరీఫ్ సీజన్లో వర్షాల తిప్పలు
- ఆరుబయటే కొనుగోలు కేంద్రాలు
- తార్పాలిన్లు, పట్టాలకు తిప్పలు
- ధాన్యం సేకరణకు అధికారుల ఏర్పాట్లు
నవతెలంగాణ-మెదక్ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో అన్ని రకాల పంటల సాగు పెరిగింది. ఈ నెలాఖరు నుంచే వరి కోతలు షురూ కానున్నాయి. ధాన్యం దిగుబడులు చేతికొచ్చే సమయానికి కొనుగోలు కేంద్రాల్ని సిద్దం చేయాల్సి ఉంది. సంగారెడ్డి జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 1 లక్షా8 వేలా 349 ఎకరాల్లో వరి సాగైంది. 315558 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. అందులో 252999 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం జిల్లా వ్యాప్తంగా ఐకెపి, పీఎసీ ఎస్, డీసీఎంఎస్‌ల ఆధ్వర్యంలో 155 ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లాలో ఉన్న 63 రైస్ మిల్లులకు గాను 22 మిల్లులు ధాన్యం మర ఆడిం చేందుకు ముందుకు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. మెదక్ జిల్లాలో 2 లక్షలా 94 వేలా ఎకరాల్లో వరి సాగైంది. సాగునీటి వనరులు అభివృద్ధి కావడం, వర్షాలు కురి యడంతో సాగు విస్తీర్ణయం పెరిగింది. జిల్లా వ్యాప్తంగా ఐకే పీ, పీఎసీఎస్ ఆధ్వర్యంలో 340 ధాన్యం కొనుగోలు కేంద్ర ాలను ఏర్పాటు చేయనున్నారు. సుమారు 9 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. ఇందులో 7.50 లక్షల మేరకు కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే అవకాశముంది. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా 2.50 లక్షల మేర వరి సాగైంది. ఇక్కడ కూడా 250 కేంద్రాల్ని ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయనున్నారు.
వర్షాల భయం..
ఖరీఫ్ సీజన్ వరిధాన్యం కోతలు షురూ అయ్యే సమ యానికి అకాల వర్షాలతో పాటు సీజన్ వర్షాలు కూడా కురిసే అవకాశముంది. ప్రతిఏటా ధాన్యం దిగుబడులు వచ్చే సమయంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత ఖరీఫ్ సీజ న్లో భారీ వర్షాలు వచ్చి ధాన్యపు రాసులు కొట్టుకు పోయాయి. కళ్లాల్లో రాసులు తడిశాయి. రంగు మారడం, మొలకెత్తడం, కొట్టుకుపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్ట పోయాయి. ఈసారి కూడా అదే పరిస్థితి ఉండే అవకాశ మున్నందున రైతులకు నష్టం వాటిళ్లకుండా జాగ్రతలు తీసు కోవాల్సిన ఉంది. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు కేంద్ర ాలన్నీ ఆరుబయటే నిర్వహిస్తారు. ధాన్యం రాసులు ఆరుబ యటే పోయడం, కాంటా వేయడానికి వారాలు పట్టడంతో వర్షాలు కురిస్తే ఇబ్బందులు తలెత్తుతాయి. ధాన్యం రాసులు పోసే ప్రాంతంలో షెడ్లు నిర్మించాలని రైతులు కోరుతున్నారు. తాత్కాలికంగా తార్పాలిన్లు, పట్టాలు ఇవ్వాలనే డిమాండ్ ఉంది. రైతులకు అవసరమైన పట్టాలను పీఎసీఎస్‌ల ద్వారా ఒక్కొ పట్టా రూ.3500 విక్రయిస్తున్నారు. వీటి ని కొనుగోలు చేయడం రైతులకు భారంగా ఉంది. గన్నీ సం చుల సమస్య వల్ల ధాన్యం కొనుగోలు ప్రక్రియ సవ్యంగా సాగదు. సంగా రెడ్డి జిల్లాకు 63 లక్షల గన్నీ సంచులు అవస రముంది. ఇప్పటి వరకు 26.24 లక్షల సంచులే అందుబా టులో ఉన్నాయి. మిగతా 37 లక్షల సంచులు రావాల్సి ఉంది. మెదక్, సిద్దిపేట జిల్లాలో కూడా గన్నీ సంచుల కొరత ఉంది.
మిడిల్ పాయింట్ల వద్ద ధాన్యం నిల్వ
రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాని కొను గోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తుంది. అట్టి ధాన్యాన్ని మిల్లులకు అప్పజెబుతోంది. మిల్లర్లు ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సివిల్ సప్లయి ద్వారా కేంద్ర ఎఫ్‌సీఐకి సీఎంఆర్ కింద బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంటోంది. మిల్లర్లు ధాన్యాన్ని తీసుకో వడం, సకాలంలో మిల్లింగ్ చేసి సీఎంఆర్ బియ్యం ఇవ్వడం లో జాప్యం చేశారు. దీంతో 2019-20, 2020-21కి సంబంధించి సీఎంఆర్ సకాలంలో మిల్లర్లు ఇవ్వకb ోవడంతో ప్రభుత్వానికి నష్టం వచ్చింది. దీంతో ఈ సారి ధాన్యం కొనుగోలు చేశాక నేరుగా మిల్లులకు కాకుండా మిడి ల్ పాయింట్లకు తరలించాలని నిర్ణయించారు. ధాన్యం సేకరణ పూర్తయ్యాక దశల వారిగా పక్క రాష్ట్రాల్లోని మిల్లు లకు కేటాయించనున్నారు. గతంలో ధాన్యాన్ని కాంటా వేసిన వెంటనే లారీలలో మిల్లులకు తరలించేంది. ఇపుడు మిడిల్ పాయింట్‌కు తరలిస్తామంటున్నారు. దూరం పెరగడం, దిగుమతి, కార్మికులతో పనిచేయించడం వంటి ఇబ్బందు లుంటాయి. ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి నష్టం ఏర్పడకుండా చూడాలని రైతు సంఘం నాయకులు పేర్కొంటున్నారు.