Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగారెడ్డి
పూలను పూజించి పండుగ చేసుకునే గొప్ప సంస్కృతి తెలంగాణదే అని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం సంగారెడ్డి పట్టణంలోని జెడ్పీలో నిర్వహించిన బతుకమ్మ పండగ వేడుకలకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌తో పాటు రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి టి.హరీశ్‌రావు సతీమణీ శ్రీనిత, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సతీమణీ మంజుల, ఆందోల్ ఎమ్మెల్యే చంట ిక్రాంతికిరణ్ సతీమణీ పద్మిని, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సతీమణీ జయశ్రీ, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సతీమణీ యాదమ్మ, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి సతీమణీ నిర్మల, జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి పాల్గొని బతుకమ్మ పూజలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మ వేడుకల్లో ఆడిపాడారు. ప్రజా ప్రతినిధులు, వారి సతీమణులు, మహిళా అధికారులు బతుకమ్మ వేడకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మంతటా బతుకమ్మ పండుగ వేడుక సంబరాలు ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. ప్రకృతిని ఆరాధించే పండుగలలో బతుకమ్మ పండగకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. శ్రీనిత హరీష్‌రావు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను జగమంతా తెలిసేలా ప్రతి ఏటా ఘనంగా బతుకమ్మ సంబరాలను జరుపుకుంటున్నామన్నారు. పూలను పూజించే పండగనే బతుకమ్మ అన్నారు. మహిళలందరూ పూలను గౌరీ దేవిగా ఆరాధించి, ఆటపాటలతో అనందించే గొప్ప పండగని పేర్కొన్నారు. జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మహిళలు గొప్పగా జరుపుకునే పండగ బతుకమ్మ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత సంస్థ చైర్మెన్ చింత ప్రభాకర్, ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మీ, వైస్ చైర్పర్సన్ లతావిజయేందర్‌రెడ్డి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు.