Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జిన్నారం
మండల పరిధిలోని గడ్డపోతారం, కిష్టయ్యపల్లి, అలీ నగర్ గ్రామాల్లో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మాహిపా ల్‌రెడ్డి రూ.75 లక్షల అభివృద్ధి పనులను స్థానిక సర్పంచ్ పులిగిల్ల ప్రకాశం చారితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అలీనగర్‌లో రూ.15లక్షలతో బతుకమ్మ ఆట స్థలం, గడ్డపోతారంలో రూ.20 లక్షలతో భూ గర్భ మురుగు నీటి పారుదల సౌకర్యం పనులు, రూ.25 లక్షల తో మహిళా భవనం, కిష్టయ్యపల్లిలో రూ.15 లక్షలతో బతుకమ్మ ఆట స్థలాలు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజల ఆకాం క్షకు అనుగుణంగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీర్చి దిద్దుతూ ఆదర్శవంతమైన ప్రగతి పనులను చేపడుతు న్నామన్నారు. ఉప సర్పంచ్ మమత పెన్టేష్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేశంగౌడ్, ఎంపీటీసీ జానబాయి, సొసైటీ వైస్ చైర్మెన్ విద్యానంద రావు, మాజీ ఎంపీటీసీ బాశెట్టి రాజు, నాయకులుసాయి భరత్ , కార్తీక్, రాజు, నాగేష్ గణేష్ భీవ్రావు జిన్నారం మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజేష్, మహేందర్, గణేష్, దేవా, వేణు, వెంకటేష్ శ్రీకాంత్, యువ జన విభాగం అధ్యక్షులు నందు తదితరులు పాల్గొన్నారు.