Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికులకు పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలి
- లేని యెడల సమ్మె తప్పదు
- సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి
నవతెలంగాణ-సంగారెడ్డి
కాంట్రాక్ట్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి.. కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని సీఐటీ యూ జిల్లా సహాయ కార్యదర్శి ఎం.యాదగిరి డిమాండ్ చేశారు. సంగారెడ్డి పట్టణంలో ఉన్న మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు పెండి ంగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని.. కాంట్రాక్ట్ వ్యవస్థ పూర్తిగా రద్దు చేయాలని, కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. లేని యెడల కార్మికులతో కలిసి సమ్మె నిర్వహిస్తామని అన్నారు. కనీస వేతనం రూ.15600 ఇవ్వాలని ఉత్తర్వులు వచ్చిన ప్పటికీ ఇక్కడ మాత్రం అమలు చేయడం లేదన్నారు. మెడి కల్ కాలేజీలో కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కార్మికు లకు బ్యాంకు దారా వేతనాలు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తున్న కాంట్రాక్టర్ పైన చర్య తీసుకోవాలన్నారు.కనీస వేతనం అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ పైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీఐటీయూ నాయకులు నాగరాజు, యాద గి రి, కిరణ్, శరత్, మరియమ్మ, శోభ, రమాదేవి, ఆంజనేయు లు, సాయి, రాములు, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.