Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మనూరు
బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఒకటో తేదీనాడే వేతనాలు చెల్లించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వై. అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి నెలా పదిహేను తేది వరకు కూడా వేతనాలు అందని పరిస్థితులు దాపురించాయన్నారు. తెలంగాణకు ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మొదటి తేదీనే వేతనాలు చెల్లించాల న్నారు. ఆర్థిక పరిస్థితిని ముందు చూపుతూ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన పెద్ద మొత్తంలో బిల్లులు మంజూరు చేయకుండా పెండింగులో ఉంచారరని విమర్శించారు. ఉపాధ్యాయుల టీఎస్ జిఎల్ఐ లోనులు, ఫైనల్ పేమెంట్లు మార్చి నెల నుండి పెండింగులో ఉన్నాయ న్నారు. అలాగే డిఏ బిల్లులు ఇప్పటి వరకు రాలేదని.. పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులకు రావాల్సిన చివరి చెల్లిం పులు ఏడు నెలలుగా మంజూరుకు నోచుకోవడం లేదన్నా రు. అలాగే జిపిఎఫ్ బిల్లులు కూడా గత మార్చి నెల నుంచి పెండింగులోనే ఉన్నాయన్నారు. జిపిఎఫ్ లోనులు, పార్ట్ ఫైనల్ దరఖాస్తు చేసుకుంటే ఇప్పటికి మంజూరు కాక ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ వద్ద జిల్లాకు సంబందింధించి సుమా రు నలభై చెక్కులు పెండింగులో ఉన్నాయన్నారు. నాలుగేండ్లుగా బదిలీలు, ఏడేండ్లుగా పదోన్నతులు లేక విద్యారంగ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా మారిపోయిం దన్నారు. వెంటనే ఈ సమస్యలన్నింటిని పరిష్కరించడంతో పాటు.. ఒకటో తేదీనాడే వేతనాలు ఇవ్వాలన్నారు. జిల్లా అధ్యక్షుడు నాగారాం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి అనుముల రాంచందర్, జిల్లా కౌన్సిలర్లు భాస్కర్, సుభాష్ బాబు, జిల్లా కార్యదర్శి అశోక్ కుమార్, దుర్గం నర్సింలు, చాంద్ పాషా మొదలగు వారు పాల్గొన్నారు.