Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వృత్తి రక్షణకు ఐక్య ఉద్యమాలు నిర్మిద్దాం
- రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ పిలుపు
నవతెలంగాణ-సంగారెడ్డి
కల్లుగీత కార్మిక సంఘం కంది మండల మహాసభను సంగారెడ్డిలోని అంబేద్కర్ భవనంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా సంఘం జెండాను జిల్లా అధ్య క్షులు ఆశన్న గౌడ్ ఆవిష్కరించారు. అనంతరం జంగన్న గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన మహాసభకు ముఖ్య అతిథు లుగా కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్ రమేష్ గౌడ్ హాజరై మాట్లాడారు. కల్లుగీత వృత్తి రక్షణ కోసం, కార్మికుల ఉపాధి కోసం, గౌడ కులస్తుల సంక్షేమం కోసం 1957లో కల్లుగీత కార్మిక సంఘం ఏర్పడిందన్నారు. నాటి నుండి నేటి వరకు అనేక ఉద్యమాలు నిర్వహించి హక్కు లను సాధించిందన్నారు. సంఘం పోరాట ఫలితంగా వేలం పాటలు రద్దు చేసుకోవడం, సొసైటీలను ఏర్పాటు చేసుకో వడం, ప్రమాదం జరిగితే ప్రభుత్వం నుంచి ఎక్స్‌గ్రేషియా పొందడం, తాటి చెట్ల పెంపకానికి 560 జీవో లాంటి ఎన్నో విజయాలను సాధించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత పారిశ్రామిక కార్పొరేషన్‌కు కేటాయించిన రూ.5000 కోట్లన ు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గౌడ కల్లు గీత కార్మికుల యువకులకు ఉపాధి కల్పించే విధంగా గీతన్న బంధు పథకాన్ని అమలు చేయాల న్నారు. ఈత, తాటి చెట్లు నరికిన వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ఎక్సైజ్ చట్టాన్ని మార్చాలన్నారు. గ్రామా ల్లో అక్రమంగా నడుస్తున్న మద్యం బెల్టు షాపులను అరిక ట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వృత్తి రక్షణ కోసం, కార్మికుల సంక్షేమం కోసం జరిగే పోరాటాల్లో కల్లుగీత కార్మికులు ఐక్యంగా ఉద్యమించి వృత్తిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్ శ్రీధర్ గౌడ్. పెద్దలు దుర్గా గౌడ్. ప్రసాద్ గౌడ్, టంకేష్ గౌడ్ కలాలి శ్రీనివాస్ గౌడ్. కృష్ణ గౌడ్ లక్ష్మణ్ గౌడ్, హరీష్ గౌడ్, శ్రీధర్ గౌడ్, నాగ పవన్ గౌడ్, యాదగౌడ్ సత్యనారాయణ గౌడ్, శంకర్ గౌడ్, వీరేశం గౌడ్, రవీందర్ గౌడ్, అశోక్ గౌడ్ చరణ్ గౌడ్, సాయిగౌడ్, బాలరాజ్ గౌడ్, యాదగౌడ్, తదితరులు పాల్గొన్నారు.