Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొల్చారం
నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని దుర్గామాతను వేడుకున్నట్టు నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునితారెడ్డిలు తెలిపారు. ఆదివారం మండలంలోని రంగంపేట గ్రామంలో దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్యే మదన్ రెడ్డి తో పాటు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునితా రెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు స్థానిక బస్టాండ్ నుంచి దుర్గామాత మంటపం వరకు పోతురాజుల విన్యాసాలు, డోలు వాయి ద్యాల మద్య ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునితారెడ్డి లు మాట్లాడారు. ప్రతీ ఏటా దుర్గామాత ఉత్సవాలను ప్రజలు ఆనందంగా నిర్వహించుకోవడం శుభపరిణా మన్నా రు. అంతకుముందు మహిళలు బోనాల ఊరేగింపు నిర్వహించి ఎమ్మెల్యే మదన్ రెడ్డికి బోనం ఎత్తారు. అనం తరం అమ్మవారికి నైవేద్యాలను సమర్పించారు. ఇందులో పోతరాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తదనంతరం ఎమ్మెల్యే మదన్ రెడ్డి తో పాటు సునితారెడ్డిలు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగె రమేష్ కుమార్, ఎంపీపీ మంజుల కాశీనాథ్, జెడ్పిటిసి మేఘమాల సంతోష్, సర్పంచ్ బండి సుజాత రమేష్, ఎంపీటీసీ గోకని మాధవి రాజా గౌడ్, టిఆర్ఎస్ నాయకులు వంజరి మల్లేశం, రవీందర్ గౌడ్, దుర్గేష్గౌడ్, సురేష్, దుర్గేష్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.