Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మెదక్‌రూరల్
సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా శాంతి మార్గంలో దేశానికి స్వాతంత్య్రం సముపార్జించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని అదనపు కలెక్టర్ రమేష్ అన్నారు. జై జవాన్ జై కిసాన్ నినాదంతో సుపరిచితుడైన స్వాతంత్య్ర సంగ్రామంలో చురుకుగా పాల్గొన్న లాల్ బహుదూర్ శాస్త్రి జన్మదిన కూడా నేడే అన్నారు. ఇద్దరు మహానీయల జన్మది నం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. జాతిప ిత 153వ జయంతి సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా సహాయ నిరాకరణ వంటి ఎన్నో ఉద్యమాలు అహింస మార్గంలో చేపట్టి బ్రిటిష్ వారిని దేశం నుండి పారదో లారన్నారు. మహనీయుల ఆశయాలను, ఆదేశాలను స్ఫూ ర్తిగా తీసుకొని మంచి ఆలోచనతో సన్మార్గంలో పయనిం చాలన్నారు. జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనివాస్, నీటిb ారుదల శాఖ ఈఈ శ్రీనివాసరావు, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, జిల్లా యువజన సంక్షేమ అధికారి నాగరాజ్, కలెక్టరేట్ ఏవో యూనిస్ తదితరులు పాల్గొన్నారు.
మహాత్మా గాంధీ అడుగుజాడల్లో మనమంతా నడవ టమే మనం మహాత్ముడికి ఇచ్చే ఘనమైన నివాళి అని మెదక్ ఎమ్మెల్యే యం.పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నేటి యువతరం నడవా లన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షులు యం.గంగాధర్ మున్సిపల్ కౌన్సిలర్లు జయరాజ్ బీమారి, కిషోర్, నాయకులు, ఉమర్ ముజీబ్, జుబేర్, కిరణ,్ మెదక్ మండల వైస్ ఎంపీపీ, ఆంజనేయులు, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
హవేలీఘనపూర్ : మహాత్మ గాంధీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని, ఆయన పోరాట స్ఫూర్తిని ప్రత్యేక ఆద ర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి అన్నారు. మండలంలోని కుచన్ప ల్లిలో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్లర్పించారు. ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, సర్పంచులు సవిత శ్రీకాంత్, యామిరెడ్డి, ఎంపీటీసీలు చిట్యాల అర్చన శ్రీనివాస్, జ్యోతి సిద్దిరెడ్డి, ఉపస ర్పంచ్ బయ్యన్న, నాయ కులు శీను నాయక్, భాస్కర్, రేకమయ్య, రాజు తదితరులు, పాల్గొన్నారు.
నర్సాపూర్ : నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలో ఆదివారం మహాత్మా గాంధీ జయంతి వేడుక లను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఆర్యవైశ్య సంఘం, గౌడ సంఘం, కాంగ్రెస్ పార్టీల చెందిన నాj ుకులు, గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లర్పించారు. అనంతరం ఆయన దేశానికి సేవ చేసిన సేవలను కొనియాడారు.మున్సిపల్ చైర్మన్ ముర ళి యా దవ్, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అశోక్, గౌడ్ శ్రీధర్ గుb ా్త, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా, కాంగ్రె స్ రాష్ట్ర నాయకులు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మెదక్‌టౌన్ : మునిసిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ తొడుపునురి చంద్రపాల్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళ్లర్పించారు. చైర్ పర్సన్ మాట్లాడుతూ.. గాంధీజీ అడుగు జాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. వైస్ చైర్ పర్సన్ మల్లిఖార్జున్ గౌడ్, కౌన్సిలర్ =లు భీమరి కిషోర్ కుమార్, వంజరి జయరాజ్, బట్టి లలిత, మహమ్మద్ సమి యొద్దిన్, మున్సిపల్ కమీషనర్ శ్రీహరి, సీనియర్ అసిస్టె ంట్లు చంద్రమోహన్, శ్రీపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పెద్దశెంకరంపేట : మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం ఎమ్యెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించ ారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాంధీజీ అలుపెరుగని స్వాతంత్ర పోరాటయో ధుడని, జాతి పితామ హుడని, అహింసా మార్గాన్ని ఎన్నుకొని, సత్యాగ్రహం ద్వారా స్వాతంత్రాన్ని సాధించిన మహాత్ముడని, కొనియాడారు. ఎంపీపీ జంగం శ్రీనివాస్, మండలాధ్యక్షులు మురళి పంతులు, సర్పంచ్ సత్యనారాయణ, వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్, మాజీ ఎంపీటీసీ వేణుగోపాల్ గౌడ్, ఎంపీటీసీ లు వీణా సుభాష్ గౌడ్, స్వప్న రాజేష్, నాయకులు జంగం రాఘవులు, పల్లెబోయిన పున్నయ్య, కంచరి మానయ్య, పి. మానయ్య, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
నిజాంపేట : మండల పరిధిలోని నస్కల్లో సర్పంచ్ ఆధ్వ ర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. అనంతరం గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్, పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ప్లాస్టిక్ వాడడం ప్రమాదకరమని.. ప్లాస్టిక్ వాడడం పై కఠినమైన చర్యలు తీసుకుంటామ పాలకవర్గం సభ్యులు అన్నారు. అనంతరం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో దాతల సహక ారంతో గ్రామానికి సమాచారం కోసం నూతన మైకు విధానాన్ని సర్పంచ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఉప సర్పంచ్ తీగల జ్యోతి, కార్యదర్శి ప్రేమలత, వార్డు సభ్యులు నరసింహులు, నవీన్, టిఆర్ఎస్ నాయకులు పంగ రాజు, పాగాల ఎల్లం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల ఎంపీపీ దేశెట్టి సిద్ధ రాములు ఆధ్వర్యంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాల లేసి ఘనంగా నివాళులు అర్పిం చారు. ఈ సందర్భంగా ఎంపీపీ సిద్దరాములు మాట్లాడు తూ.. దేశానికి స్వాతంత్రం రావడానికి గాంధీజీ ముఖ్య పాత్ర పోషించారన్నారు. చల్మెడ ఎంపీటీసీ నంద్యాల బాల్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ గౌస్, నందిగామ ఎంపీటీసీ లద్ద సురేష్, నగరం గుగులోతు రవి, కంప్యూటర్ ఆపరేటర్ శ్రీనివాస్, ఏపీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రేగోడు : గాంధీ జయంతి సందర్భంగా రేగోడులోని గాంధీ విగ్రహానికి సర్పంచ్ నర్సింలు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి గాంధీ జయంతి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ గాంధీ చూపిన బాటలో నడుచుకోవాలని సర్పంచ్ అన్నారు. ఎంపీటీసీ నరసింహులు, టీఆర్ఎస్ రేగోడు గ్రామాధ్యక్షులు సుభాష్, గ్రామస్తులు పాల్గొన్నారు.
హవేలీఘనపూర్ : మండలంలోని వాడి గ్రామ చౌరస్తాలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని సర్పంచ్ యామిరెడ్డి ప్రారంభించారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతిపిత మహాత్మా గాంధీ అహింస అనే మార్గం ద్వారా ఎన్నో పోరా టాలు చేసి దేశానికి స్వాతంత్రాన్ని సాధించారని కొనియా డారు. ఎంపీటీసీ జ్యోతి సిద్ది రెడ్డి, ఉపసర్పంచ్ మల్లయ్య, మాజీ ఎంపీటీసీ బిక్షపతి రెడ్డి, మాజీ సర్పంచ్ ఎల్లయ్య, రిటైర్డ్ టీచర్ లు భూమయ్య, రామ్ రెడ్డి, మాజీ ఎంపిటిసి సాయిలు, యాదవ సంఘం, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
వెల్దుర్తి : మాసాయిపేట, వెల్దుర్తి మండలాల్లో ఆదివారం గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సంద ర్భంగా మహాత్మా గాంధీ కలలుగన్న స్వరాజ్యాన్ని నిర్మిద్దావ ుని.. ఆయన అడుగుజాడల్లో నడవాలని ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి అన్నారు. మానేపల్లి గ్రామంలో ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ,ి్డ స్థానిక సర్పంచి వెంకట్ లక్ష్మి శ్రీనివా స్రెడ్డిలు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పిం చారు. మండల కేంద్రంలో హనుమాన్ దేవాలయం పక్కన గాంధీ విగ్రహానికి ఎంపీటీసీ మోహన్ రెడ్డి, మాసాపేట మండల కేంద్రంలో స్థానిక సర్పంచి మధుసూదన్ రెడ్డి, వివిధ గ్రామాల్లో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు.
కొల్చారం : కోనాపూర్‌లో టీఆర్ఎస్ మండల యూత్ అద్యక్షుడు సంతోష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ నాయకులు గాంధీ విగ్రహానికి పూలదండ వేసి నివాళులర్పించారు. సంగాయిపేటలో గాంధీ జయంతి వేడుకల్లో టీఆర్ఎస్ నాయుడు నవాజ్ రెడ్డి పాల్గొని పూలదండ వేసి ఘనంగా నివాళులు అర్పించి మాట్లాడారు. రంగంపేట సొసైటీ వైస్ చైర్మన్ మోతుకు మల్లేశం, వైస్ ఎంపీపీ మల్లారెడ్డి, సర్పంచ్ కన్నారం రమేష్, పంచాయతీ కార్యదర్శి నగేష్, బండి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
తూప్రాన్ రూరల్ (మనోహరాబాద్) : జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో ఆదివారం రోజు ఘనంగా నిర్వహించారు. గ్రామాల్లోని గాందీ విగ్రహాల వద్ద నాయకులు ప్రజలు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ మనోహరాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచ్ల ఫోరం వర్కింగ్ ప్రసిడెంట్ చిట్కుల్ మహిపాల్‌రెడ్డి, ఫాక్స్ డైరెక్టర్ జావీద్‌పాషా, మాజీ ఉపసర్పంచ్ వెంకట్‌రెడ్డి, నాయకులు మహెందర్, వార్డు సభ్యులు ధశరథ, యాదగిరి, భిక్షపతి, అజయ్‌గౌడ్, కార్యదర్శి రూపాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.