Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ/తూప్రాన్‌రూరల్ (మనోహరాబాద్)
నిరుపేదల కుటుంబాలకు ఆడపిల్లల పెండ్లిళ్లు భారం కాకూడ దని కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి ఆడపిల్లలకు ఓ అన్నలా సీఎం కేసీఆర్ భరోసానిస్తున్నారని ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి అన్నారు. మండలంలోని పోతారం, గౌతోజిగూడ, పర్కిబండ గ్రామాలకు చెందిన కల్యాణలక్ష్మి లబ్దిదారులకు జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలత శేఖర్‌గౌడ్‌తో కలిసి ఆదివారం చెక్కులను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీలను అమలు చేస్తూ నిరుపేదలను ఆదుకుంటు న్నారన్నారు. ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, రాష్ట్ర సర్పంచ్ల ఫోరం వర్కింగ్ ప్రసిడె ంట్ చిట్కుల్ మహిపాల్‌రెడ్డి, నాయకులు పురం రవిముదిరాజ్, తహశీల్దార్ భిక్షపతి, మనోహరాబాద్ వైస్ ఎంపీపీ యంజాల విఠల్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ బడికోలు మాధవరెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు బడికోలు ప్రభాకర్‌రెడ్డి, ఉపస ర్పంచ్ వీరేష్, మండల పార్టీ అధ్యక్షులు రమణగౌడ్, సర్పంచ్‌లు పూల అర్జున్, వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షులు పంచమి రేణుకుమార్, నాయకులు చింతల ఆనంద్, మంచ శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.