Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబేద్కర్, పులే వంటి మహనీయుల ఆశయ సాధనకు కృషి
- కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మానిక్
నవతెలంగాణ-సంగారెడ్డి
కుల వ్యవస్థ లేని సమాజమే లక్ష్యంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) పనిచేస్తున్నదని ఆ సంఘం సంగారెడ్డి జిలా ప్రధాన కార్యదర్శి అతిమెల మానిక్ అన్నారు. కేవీపీఎస్ 24వ ఆవిర్భావ దినోత్సవం సంద ర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆత్మగౌరవం, సమాన త్వం, కుల నిర్మూలన లక్ష్యాలతో కూడిన కేవీపీఎస్ జెండాను మానిక్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడ ుతూ.. ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన లక్ష్యం సాధనకు మహాత్మ జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో కేవీపీఎస్ పోరాడుతున్నదన్నారు. సంఘం ఆవిర్భవించి 24 ఏండ్లు అవుతుందని.. ఈ ప్రస్థా నంలో అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించామన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని సాధించేందుకు కేవీపీఎస్ ప్రధాన భూమిక పోషించిందన్నారు. కుల దురహంకార దాడులు, హత్యలు ఎక్కడ జరిగినా.. వాటిని వ్యతిరేకిస్తూ కేవీపీఎస్ ముందుండి పోరాడుతుందన్నారు. నేటి కేంద్ర బీజేపీ పాలకులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాజ్యా ంగ హక్కులను కాలరాస్తునారన్నారు. మతోన్మాద విధాన ాలతో దళితులపై అనేక రూపాల్లో సామాజిక అణిచివేతలు, దాడులు, దౌర్జన్యాలు హత్యలు పెరిగేందుకు అనేక కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగారిచే కుటిల యత్నాలు చేస్తున్నారన్నారు. దళితులకు రిజర్వేషన్ల ఫలాలు అందకుండా ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు పరం చేస్తూ దళితులను అన్ని రంగాల్లో నిరాధారులుగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నారు. దళితు లకు ఇస్తానన్న మూడు ఎకరాల భూమి, ప్రస్తుతం ఇస్తున్న దళితబంధు పథకాల నిర్వాహకంతో తేటతెల్లమవుతున్నదని విమర్శించారు. దళితులంతా ఐక్యంగా నిలిచి బాబా సాహెబ్ అంబేద్కర్, ఫూలే ఆశయ సాధనకు ఉద్యమించాలన్నారు. కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మద్దూరు శివకుమార్, జిల్లా సహాయ కార్యదర్శి బి. ప్రవీణ్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు మహేష్, దత్తు, ఉపాధ్యక్షులు మహేష్, నాయకులు పవన్, సుమన్, బస్వారాజ్, దశరథ్, ప్రభాకర్ పాల్గొన్నారు.
మనూరు : నాగల్గిద్ద మండల కేంద్రంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆ సంఘం మండల ప్రధాన కార్యదర్శి యస్.గణపతి మాట్లాడుతూ.. ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన లక్ష్య సాధన కోసం 1998 అక్టోబర్ 2న కేవీపీఎస్ ఏర్పడిందన్నారు. నాటి నుండి అనేక సమర సుశీల ఉద్యమాలు నిర్వహించి విజయాలు సాధించిందన్నారు. గోపాల్, రజనీకాంత్, కష్ణ, దత్తు, సుదీప్ తదితరులు పాల్గొన్నారు.