Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు వాజిద్ అలీ
నవతెలంగాణ-పటాన్చెరు
పాశంమైలారం బీపీఎల్ చౌరస్తా నుంచి ముత్తంగి ఔటర్ రింగురోడ్డు వరకు సర్వీస్ రోడ్ విస్తరణలో ఇండ్లు, భూములు కోల్పోతున్న నిర్వాసితులకు తగిన నష్ట పరిహారం చెల్లించాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఎండీ వాజీద్ అలీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని శ్రామిక భవన్లో జరిగిన పట్టణ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పటాన్చెరు మండలంలోని పాశ మైలారం బీపీఎల్ చౌరస్తా నుంచి ముత్తంగి ఔటర్ రింగు రోడ్డు వరకు సర్వీస్ రోడ్ విస్తరణలో ఇండ్లు, భూములు కోల్పోతున్న నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇస్నాపూర్ గ్రామ సర్వే నెంబర్ 496లో 2010లో ఇండ్లకు పట్టా సర్టిఫికేట్లు ఇచ్చిందన్నారు. ముత్తంగి గ్రామం పక్కన నుంచి ఔటర్ రింగురోడ్డు వరకు కలిసే సర్వీస్ రోడ్ విస్తరణలో ఇంకా కొంత మంది రైతులకు నష్టపరిహాం ఇవ్వలేదన్నారు. ఇండ్లు. భూములు కోల్పోతున్న వారికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని ఆరోపించారు. జిల్లా రెవెన్యూ యంత్రాంగం అక్కడి భూములను సర్వే చేశారు కానీ పై అధికారులకు ఎలాంటి సమాచారం అందచేయలేదన్నారు. 200 ఫీట్ల రోడ్ నిర్మాణం పరిశ్రమలకు వెళ్లేందుకు నిర్మిస్తున్న తరుణం లో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 2013 భూ సేకరణ చట్టం పరిహారం ఎందుకు అమలు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిర్వాసితులకు తగిన నష్టపరిహారం చెల్లిం చాలని, లేని పక్షంలో ప్రజలతో ఆందోళన చేస్తామని హెచ్చ రించారు. నాయకులు బి నాగేశ్వరరావు, బి అర్జున్, రామ చంద్రమూర్తి, కృష్ణ,రవి,వరుణ్ తదితరులు పాల్గొన్నారు.