Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ/తూప్రాన్ రూరల్ (మనోహరాబాద్)
భారత జాతీయ రహదారుల నిర్వాహణ సంస్థ ఆదేశాల మేరకు జీఎంఆర్ పోచంపల్లి ఎక్స్ప్రెస్ వేస్ లిమిటెడ్ ఆద్వర్యంలో ఈ నెల 2 నుండి 31 వరకు స్వఛ్చ భారత్ కార్యక్రమాలను నిర్వహిం చనున్నట్టు ప్రాజెక్టు మేనేజర్ వెంకటరమణ పేర్కొన్నారు. మంగళవారం రోజు తూప్రాన్ మండలం టోల్ ప్లాజా వద్ద స్వఛ్చ భారత్ కార్యక్రమాలను నిర్వ హించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్వఛ్చ భారత్లో బాగంగా మూడో రోజు జీఎంఆర్ పోచంపల్లి ఎక్స్ప్రెస్ వేస్ లిమిటెడ్ ఆద్వర్యంలో స్వఛ్చ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. టోల్ ప్లాజా వద్ద టోల్ బూతుల వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్, కుమార్, లక్ష్మన్రావ్, సతీష్ పట్నాయక్, వసంత్ సాయి, జీవన్, రామక్రిష్ణ, నర్సింలు; రాకేశ్, గోపి నాయక్, ఫౌండేషన్ ప్రతినిధి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.