Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నంగునూరు
క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని ఎంపీటీసీ బెదురు తిరుపతి, టీఆర్ఎస్ నాయకులు డాకూరి భాస్కర్ రెడ్డి అన్నారు. మంగళవారం నంగునూరు మండ లంలోని సిద్దన్నపేట గ్రామంలో వాలీబాల్ ముగింపు సందర్భంగా గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. సిద్దన్నపేటలో వారం రోజులుగా ఆర్గనైజర్ బండి ప్రశాంత్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఫైనల్ విన్నర్ గా సాయిరాం టీం గెలుపొందగా సర్పంచ్ డాకురి కనకవ్వ రెండు వేల నగదు అందించారు. రన్నర్ ఆఫ్ టీంకు ఎంపీటీసీ బెదురు తిరుపతి వేయి రూపాయల నగదు అందించారు. కార్యక్రమంలో షీల్డ్ బహుకరణదాత కొన్నె సంపత్, వాలీబాల్ దాతగా బెదురు నర్సింలు, అనరాజుల కన్నయ్య, నాయకులు బెదురు మల్లేశం, సొప్పరి రమేష్, సతీష్ రెడ్డి, తడ్కపల్లి శ్రీనివాస్, తిరుమల్ రెడ్డి, నకీర్త రాజమల్లు, కిరణ్, రాజు, సాయి, కిషన్, సంతోస్, సంపత్, వంశీ, అజరు, తిరుపతి, ఇర్ఫాన్, సాగర్, రాజిరెడ్డి, అరవింద్, సందీప్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.