Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 57 ఏండ్లు నిండిన వారికి రూ.3వేల పింఛన్
- వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల
నవతెలంగాణ-చేగుంట
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధికారంలోకి రాగానే మొదటగా నిరుద్యోగ ఫైల్ పైనే సంతకం పెడతానని, 57 ఏళ్లు నిండిన వారికి మూడు వేల రూపాయల పింఛన్ ఇస్తా మని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. గత కొన్ని రోజులుగా ఆమె చేస్తున్న పాదయాత్ర మంగళవారం చేగుంట పట్టనానికి చేరింది. ఈ సందర్భంగా ఆమెకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ.. రాజశేఖర్ రెడ్డి పాలనలో రైతులకు రుణమాఫీ ఏకకాలంలో ఇచ్చారని, ఉచిత కరెంట్, పంట నష్ట పరిహారం, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, లాంటి ఎన్నో సౌకర్యాలు కల్పించారన్నారు. నియోజకవర్గానికి మూడు మార్కెట్ కమిటీ ఏర్పాటు చేశాడని, చేగుంటలో గురుకుల, మోడల్, కస్తూర్బా ,పాలిటెక్నిక్, ఏర్పాటు చేశార న్నారు. అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ మాత్రం అన్ని ధరలు పెంచి పేదొడి నడ్డి విరుస్తున్నారన్నారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్ల, రైతు రుణమాఫీ, ఇంటికొక ఉద్యోగం, నిరుద్యోగులకు మూడువేల రూపాయలు, ఉద్యోగాల నోటిఫికేషన్లు లాంటి హామీలను గాలికి వదిలేశారన్నారు. కాగా తన పాద యాత్రలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అవినీతి గురించి మాట్లాడ ితే.. తమపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారన్నారు. క్రాంతి కిరణ్ దళితుల పక్షాన పోరాడాల్సింది పోయి ఓ ఆడపిల్లపై కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. నేరెళ్ల ఇసుక మాఫియా లో దళిత బిడ్డలపై జరిగిన ప్రమాదాల గురించి ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పోరాటం చేయాలని.. దళిత ముఖ్యమంత్రి చేస్తని, మాట తప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేసు పెట్టాలన్నారు. మల్లన్న సాగర్ బాధితులకు ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇచ్చిన హామీ నెరవేర్చాలేదన్నారు. పరిహారం ఇప్పించకపోతే 6 నెలల్లో రాజీనామా చేస్తానన్నా మాటలు ఇప్పుడు ఏమ య్యాయని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రజలందరూ ఆలో చించి వైయస్సార్ తెలంగాణ పార్టీ ని మీరందరూ ఆశీర్వది ంచాలని కోరారు. వివిధ మండలాల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు.