Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గజ్వేల్
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్‌కు రెండు కోట్లు మంజూ రు చేస్తున్నట్టు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ నేతి చిన్న రాజమౌళి తెలిపారు. మంగళవారం హైదరాబాదులో స్వచ్ఛ అవార్డులను అందుకున్న మున్సిపల్ పాలకవర్గం సమావేశాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సి పల్ చైర్మన్ మాట్లాడుతూ.. గజ్వేల్ మున్సిపాల్టీని మరింత అభివృద్ధి చేసేందుకు రెండు కోట్లు మంజూరు చేశారన్నారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డును అందుకోవడం గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జకీర్, మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.