Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వట్పల్లి
మండలంలోని మంచిర్యాల తాండా శివారులో అటవీశాఖ, రెవిన్యూ శాఖకు సంబంధించిన అటవీ ప్రాంత పోడు భూములను గుర్తించేందుకు అటవీశాఖ అధికారులు చేపట్టిన పోడు భూముల సర్వేను జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజర్జి షా మంగళవారం పరిశీలించారు. గత కొన్ని రోజులుగా 85 సర్వే నంబరులో గల భూమిలో రెవెన్యూ, అటవీశాఖల మధ్యన హద్దుల వివాదం కొనసాగుతున్న సంగతి విధితమే. 2020లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించినప్పటికీ.. అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యం గా వ్యవహరించడంతో సమస్య జటిలంగా మారి వివాదా లకు దారి తీసింది. అయితే ఈ మధ్యకాలంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో వట్పల్లి జెడ్పీటీసీ పత్రి అపర్ణ శ్రీకాంత్ సర్వసభ్య సమావేశంలో అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టడంతో జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శరత్ వెంటనే జోక్యం చేసుకొని సమస్య పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో గత నాలుగైదు రోజులుగా మండల పోడు భూముల కమిటీ అధ్యక్షతన అటవీ శాఖ ఆధ్వర్యంలో భూములను గుర్తించేందుకు సర్వేను నిర్వహిస్తున్నారు. కాగా ఈ సర్వేను అడిషనల్ కలెక్టర్ రాజర్షి షా మంగళవారం పరిశీలించారు. సర్వే జరుగుతున్న తీరు గురించి అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎంత మంది రైతులు ఎన్నేండ్ల నుంచి భూములను సాగు చేసుకుంటున్నారనే వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలన్నారు. కాగా కొందరు తమ తండ్రుల కాలం నుంచి సుమారు 50 ఏండ్లుగా ఇక్కడి భూములను సాగుచేసుకుంటూ జీవనోపాధి పొందుతు న్నామని రైతులు అడిషనల్ కలెక్టర్ వద్ద తమ గోడును వెళ్లబోసుకున్నారు. అయితే సర్వే అనంతరం అటవీశాఖ అధికారులు అందజేసిన నివేదిక ప్రకారం తుది నిర్ణయం తీసుకుంటామని అడిషనల్ కలెక్టర్ అన్నారు. అనంతరం మంచిర్యాల తాండాకు చెందిన గిరిజనులు ఇండ్ల కోసం ఏర్పాటు చేసుకున్న ప్రాంతంలో తెలంగాణ క్రీడాప్రాంగ ణాన్ని నిర్మిస్తున్నారని.. ఆ నిర్మాణాలు చేపటొద్దన్నారు. అక్కడి స్థలాల్లో ఇండ్లను ఏ విధంగా నిర్మించుకుంటున్నారు.. ఏమైనా ధ్రువ పత్రాలు ఉన్నాయా అని అడిగి తెల్సుకు న్నారు. ఏది ఏమైనా రైతులను ఒప్పించి క్రీడా ప్రాంగణాన్ని నిర్మించాలని సర్పంచ్ డిప్ల నాయక్‌ను ఆదేశించారు. అదేవి ధంగా దుద్యాల పరిధిలో నుంచి నూతన పంచాయతీగా ఏర్పడిన మంచిర్యాల తాండాకు 6 తాండాలు ఆమ్లెట్‌గా ఉండడంతో ఒక డీలర్‌ను, ఫీల్డ్ అసిస్టెంట్లును, ఒక ఆశా వర్కర్‌ను, ఏఎన్ఎం ఏర్పాటు చేయాలని ఎంపీపీ పత్రి అపర్ణ నర్సింలు, సర్పంచ్ దీప్ల నాయక్‌లు ఆయనకు వినతిపత్రం అందజేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్‌ను ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని శాలువాలతో సత్కరించారు. ఆయన వెంట తహసీిల్దార్ ప్రభులు, ఎంపీడీవో జగదీశ్వర,్ ఎంపీఓ యూసుబ్, ఉమ్మడి రేగోడు మండల మాజీ ఎంపీపీ పత్రి విట్టల్, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.