Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంబీ రికార్డు అయినా డబ్బులివ్వని అధికారులు
- రికార్డుల్లోని లెక్కలకు.. ఇచ్చిన డబ్బులకు పొంతనలేదు
- అడిషనల్ కలెక్టర్కు బాధితుడి ఫిర్యాదు
నవతెలంగాణ-వట్పల్లి
మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా నిర్మి స్తున్న పాఠశాలకు ఎంబీ రికార్డు అయినప్పటికీ డబ్బులు ఇవ్వడంలో అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. ఆ పాఠశాలను నిర్మిస్తున్న వ్యక్తి అడిషనల్ కలెక్టర్ రాజర్షి షాకు మంగళవారం ఫిర్యాదు చేశారు. కమీషన్లు ఇస్తేనే డబ్బులు వస్తాయని.. లేకుంటే ఆలస్యం అవుతాయని అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని అడిషనల్ కలెక్టర్ ఎదుట వాపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని దుద్యాల గ్రామంలో మన ఊరు-మనబడి అభివద్ధి కింద ఎంపికైన పాఠశాల భవన నిర్మాణానికి రూ.22 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో పాటు ఈజీఎస్ కింద మరో రూ.12 లక్షలను విడుదల చేసింది. అయితే అదే గ్రామానికి చెందిన మ్యాతరి బక్కయ్య పాఠశాల భవనం నిర్మాణం చేప ట్టేందుకు ముందుకు వచ్చి.. ఇప్పటివరకు రూ.11 లక్షల వరకు ఖర్చు చేసి భవన నిర్మాణం పూర్తి చేశారు. అయితే రెం డు నెలలుగా రెండు లక్షల నలభై వేల రూపాయలు ఎంబి రికార్డు అయ్యాయని రికార్డుల్లో ఉన్నప్పటికీ.. తనకు మాత్రం లక్షా అరవై వేలు మాత్రమే చెల్లించారన్నారు. మిగతా డబ్బు ల విషయాన్ని సంబంధిత అధికారుల వద్ద ప్రస్తావిస్తే.. రూ.5వేలు కమీషన్ కింద ఇస్తేనే డబ్బులు ఇస్తా మంటున్నా రన్నారు. లేని యెడల డబ్బులు ఆలస్యం అవు తాయని ఇబ్బంది పెడుతున్నారని అడిషనల్ కలెక్టర్ ఎదుట బక్కయ్య వాపోయాడు. కాగా డబ్బులు ఎవరికీ చెల్లించాల్సిన అవస రం లేదని.. ఎంబీ రికార్డ్ అయిన ప్రతులను తనకు వాట్స్ అప్ చేయాలని బక్కయ్యకు అడిషనల్ కలెక్టర్ సూచి ంచా రు. వెంటనే డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటానని హా మీ ఇచ్చారు. మన ఊరు-మన బడి కింద జరుగుతున్న ప నులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ డబ్బుల విషయంలో ఇ బ్బందులుఎదురుకాకుండా ఎంపీడీవో పర్యవేక్షించాలన్నారు.