Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఝరాసంగం
గ్రామాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్ రావు అన్నారు. మంగళవారం ఝరాసంగం మండల కేంద్రంతో నర్సాపూర్, కొల్లూర్, గంగాపూర్, మేదపల్లి, ఈదుల్ పల్లి, దేవరంపల్లి, గినియార్‌పల్లి, ప్యారవరం గ్రామాలలో సీసీ రోడ్ పనులు, సైడ్ డ్రెన్స్ పనులకు శంకుస్థాపన చేశారు. అంతే కాకుండా అర్హులైన వారికి ఆసనా పెన్షన్ ప్రొసీడింగ్ కాగితా లతో పాటు ఐడి కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మెన్ ఉమాకాంత్ పాటిల్, ఎంపీటీసీ విజెందర్ రెడ్డి, రజిని ప్రియ సంతోష పాటిల్, మండల సర్పంచ్ల పోరం అధ్యక్షులు బొగ్గుల జగదీశ్వర్, సర్పంచులు పరమేశ్వర్ పాటిల్, అంజమ్మ, బస్వరాజ్ పాటిల్, నాయక ులు సంగమేశ్వర్ పాటిల్, నర్సింలు పాటిల్, ఏ జాజ్ బాబా, రాజ్‌కుమార్, మాణిక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.