Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుమ్మడిదల
మండలంలోని బొంతపల్లి గ్రామంలో గ్రాన్యూల్స్ ఇండియా ప్రయివేటు లిమిటెడ్ సంస్థ సహకారంతో నిర్మించిన మంచినీటి లక్ష లీటర్ల వాటర్ ట్యాంకును ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మండల ప్రజాప్రతి నిధులతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాలభివృద్ధిలో పరిశ్రవుల యాజమాన్యాలు తమ వంతు పాత్ర పోషించడం అభినందనీయమన్నారు. బొంతపల్లి పారిశ్రామికవాడలోని గ్రాన్యూల్స్ పరిశ్రమ యాజమాన్యం సహకారంతో గతంలో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసుకున్నామని.. రానున్న రోజుల్లో తమ వంతు సహాయాన్ని ఎల్లప్పుడూ గ్రామానికి అందజేస్తామని పరిశ్రమ యాజమాన్యం తెలపడం హర్షించ దగిందన్నారు. ఎంపీపీ సద్ది ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జెడ్పీటీసీ కుమార్ గౌడ్, గ్రాన్యూల్స్ పరిశ్రమ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ చిగురుపాటి కృష్ణప్రసాద్, సర్పంచ్ ఆలేటి నవీన శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ ఆలేటి సంజీవరెడ్డి, ఎంపీటీసీ సురభి నాగేందర్ గౌడ్, గ్రామ వార్డు సభ్యులు వీరభద్ర స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ ఘటటి భద్రప్ప, నాయకులు ఎం నరేందర్ రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహమ్మద్ హుస్సేన్, నాయకులు గోపాల్, టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.