Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జోగిపేట
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తాలో అఖిల భారత హిందూ మహాసభ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గామాత వద్ద మహిషాసుర మర్ధిని ప్రతిమ స్థానంలో మహాత్మా గాంధీని పోలిన ప్రతిమను ఏర్పాటు చేయడంతో మంగళ వారం జోగిపేటలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిరస నను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక గాంధీ పార్కులో మహాత్మా గాంధీ విగ్రహానికిి పాలాభిషేకం చేశారు. మహాత్మా గాంధీని అవమానపరిచే విధంగా ప్రతి మను ఏర్పాటు చేసిన అఖిలభారత మహాసభ సభ్యులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఆర్యవైశ్య సం ఘం జిల్లా మాజీ అధ్యక్షులు జూకంటి లక్ష్మణ్, జోగుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ మన్సాన్పల్లి మల్లి కార్జున్, వర్తక సం ఘ అధ్యక్షులు రంగ సురేష్, ఆర్యవైశ్య సం ఘం అధ్యక్షులు రఘు, నాయకులు రాములు, విజయ్‌కుమార్, దయాకర్, రాజు, మురళి, శ్రీనివాస్, రాము తదితరులు పాల్గొన్నారు.