Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జహీరాబాద్
రైతుసేవా కేంద్రం ఆధ్వర్యంలో రైతుల సౌకర్యార్థం శనగ విత్తనాలను పంపిణీ చేస్తున్నట్టు డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ అన్నారు. గురువారం విత్తనాల పంపిణీ కార్యక్ర మంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో శనిగ విత్తనాలను ఎక్కువగా జహీరాబాద్ ప్రాంతంలోనే నాటుతారన్నారు. కనుక జహీరాబాద్లో విత్త నాల పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. జహీరాబాద్ పట్టణంలోని డీసీఎంఎస్ రైతుసేవా కేంద్రంలో 25 కిలోల శనగ బస్తా రూ.1747ఇస్తున్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచ ేస్తు న్నదని.. అందుకే రైతులకు నాణ్యమైన విత్తనాలు అంది స్తున్నామన్నారు. కిషన్ పవర్, మాన్కాల్ శుభాష్, నర్సింలు, వెంకటేశం, రాములు, రాజు తదితరులు పాల్గొన్నారు.