Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగారెడ్డి
జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న దోబి కాంట్రాక్ట్ కార్మికులకు ప్రభుత్వ జీవో ప్రకారం కనీస వేతనం రూ.15,600 ఇవ్వాల ని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న దోబి కార్మికులు గురువారం సీఐటీయూ యూనియన్లో చేరారు. ఈ సంద ర్భంగా యాదగిరి మాట్లాడుతూ.. ప్రభుత్వ జీవో ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులకు రూ.15,600 వేతనం ఇవ్వాల్సిన ప్పటికీ.. కాంట్రాక్టర్ ఇవ్వకపోవడం దారుణమన్నారు. వేతనాలు సరిపోక ఏండ్లుగా దోభీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్మికుల ఈఎస్ఐ, పీఎఫ్ పేరు మీద రూ.4600 కాంట్రాక్టరే దోచుకుంటున్నాడని ఆరోపించారు. ఈఎస్ఐ,పీఎఫ్ కటింగ్ తర్వాత 13600 కాంట్రాక్ట్ కార్మికు లకు అందజేయాల్సి ఉండగా, కేవలం రూ.8000 మాత్రమే ఇస్తున్నాడన్నారు. జీఓ ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులకు 13,600 వేతనం ఇవ్వాలన్నారు. కార్మికులకు వేతనాలి వ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్ పై చర్య తీసుకో వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రమాదేవి, అనిత, జ్యోతి నర్సింలు, రమేష్, రాజు యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.