Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగారెడ్డి
అంబేద్కర్ జెండాను అవమానించిన అగ్రకుల పెత్తం దారులను వదిలి.. బాధిత దళితులపైన అక్రమ కేసులు పెట్టడం సరికాదని.. దళితులపై అక్రమ కేసులు పెట్టిన నారాయణఖేడ్ డీఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. దళితులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తువేయాలని, అంబేద్కర్ జెండాను అవమానించిన అగ్రకుల పెత్తందారులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని కెేవీపీఎస్ జిల్లా కార్యాలయంలో దళిత ప్రజా సంఘాల నాయకులు గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు సుభాష్, జిల్లా సహా కార్యదర్శి ప్రవీణ్, రామ్ చందర్, జిల్లా కమిటీ సభ్యులు దాస్, సమతా సైనిక్ దళ్ జిల్లా ఉపాధ్యక్షులు బస్వరాజ్ , ప్రజా సంఘాల నాయకులు నాయకులు పోతరాజు పవన్, స్వేరో జిల్లా అధ్యక్షులు ప్రకాష్‌లు మాట్లాడుతూ.. కంగ్టి మం డలం ఏన్కేమూరి గ్రామంలో ఈనెల 5న దసరా పండుగ రోజున భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఫోటోతో ఉన్న జెండాను కొంతమంది అగ్రకుల పెత్తందారులు అవమా నించారన్నారు. అయితే మరుసటి రోజు పెద్దఎత్తున ఆందోళన చేయడంతో జెండాను అవమానించిన పెత్తందా రులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుకు పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించామన్నారు. అయితే నాటినుంచి విచారణ పేరుతో కాలయాపన చేయడం తప్పా.. అంబేద్కర్ జెండాను తొలగించి అవమానించిన పెత్తందారుల ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం దారుణ మన్నారు. అంబేద్కర్ జెండాను తొలగించి అవమానిం చేటపుడు అక్కడున్న దళితులు ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నించినందుకు 8 మంది దళితులపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. అంబేద్కర్ జెండాను కాపాడుకు ంటే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. దళితుల మీద అక్రమ కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతున్న నారాయ ణఖేడ్ డీఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దళితుల మీద పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తి వేయాలని.. అగ్రకుల పెత్తందారులను వెంటనే అరెస్టు చేయాలన్నారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ కలిసి విన్నవిస్తామన్నారు. దళిత ప్రజా సంఘాల నా యకులు ఎల్లయ్య జగన్ సాయిలు తదితరులు పాల్గొన్నారు.