Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుమ్మడిదల
గుమ్మడిదల మండల మహిళా సమాఖ్య సమావేశాన్ని రైతువేదికలో గురువారం నిర్వహించారు. ఈ సమావేశ ములో జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ (ఎన్ఆర్ ఎల్ఎం ) ద్వారా అమలు చేస్తున్న మోడల్ మండల సమాఖ ్యలో భాగంగా మండలంలోని అన్ని గ్రామ సంఘాల్లో మరియు స్వయంసహాయక సంఘాల్లో రాబోవు 5 ఏండ్లలో సంఘాల సభ్యులు చేపట్టబోయే (8) కీలక అంశాలు (సామాజిక, ఆర్థిక, ఆరోగ్య, విద్య, జీవనోపాధి, సాంకేతిక అంశాలు) పైన తయారుచ ేసుకున్న ప్రణాళికలను అన్ని గ్రామా సంఘాల వారీగా చర్చించారు. దీని ద్వారా రాబోయే 5ఏండ్లలో ప్రతి మహిళా సభ్యురాలు తను అనుకున్న కల నెరవేర్చు కునేవిదంగా చర్చించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా అదనపు జిల్లా గ్రామీణాభివద్ధి అధికారి సూర్యారావు పాల్గొని పలు అంశాలపై వివరించారు. అదేవిధంగా అన్ని గ్రామాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేయాలని మరియు వీఓ వారీగా తయారు చేసు ున్న ప్రణాళి కలను పరిశీలించి ప్రతి అంశాన్ని ప్రాధాన్యత వారీగా నెరవేర్చు కోవాలని సూచించారు. జిల్లా నుంచి డీపీఎంలు అంశము వారీగా క్రోడీకరణ గురించి సూచన చేశారు. ఈ సమావేశంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు జయశ్రీ రాజ్, రవీందర్, కొమురయ్య, జిల్లా ఏఎంపీఎస్ రవిశేఖర్, సత్యనారాయణ మరియు గుమ్మడిదల మండల ఏపీఎం - శివకుమార్, సీసీలు, గ్రామ సంఘం అధ్యక్షులు, వీఓఏలు తదితరులు పాల్గొన్నారు.