Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యామ్నాయ పాలసీని రూపొందించాలి
- టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు
నవతెలంగాణ-జోగిపేట
నూతన విద్యా విధానం(ఎన్ఈపీ) 2020ను రద్దు చేయాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.సాయిలు అన్నారు. ప్రత్యామ్నాయ విద్యా విధానాన్ని రూపొందించాలని, సీపీఎస్ పథకాన్ని రద్దు చేసి పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రపతికి కోటి సంతకాల సేకరణతో మెమోరండం సమ ర్పించే కార్యక్రమంలో భాగంగా గురువారం అందోల్ మండ లంలోని మైనారిటీ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెని ్షయల్, కేజీబీవీ అందోల్, జడ్.పి.హెచ్.ఎస్ డాకుర్ పాఠశ ాలలను సందర్శించి, ఉపాధ్యాయుల సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నూతన విద్యా విధానం వల్ల విద్యార్థుల డ్రాప్ అవుట్ పెరిగే ప్రమాదం ఉందని, డిటెన్షన్ పాలసీ తిరిగి రావడంతో పేద పిల్లలు చదువుకు దూరమయ్యే అవకాశం ఉందని, విద్య కేంద్రీకరణ, ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీ కరణ జరిగే ప్రమాదం పొంచి ఉన్నందున నూతన విద్యా విధానం వెంటనే రద్దుచేసి ప్రత్యామ్నాయ పాలసీని రూపొం దించాలని డిమాండ్ చేశారు. భారత ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా రూపొందించిన ఈ విద్యా విధానం పట్ల దేశ వ్యాప్తంగా విపరీతమైన వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా.. ప్రభుత్వం మాత్రం గుట్టు చప్పుడు కాకుండా అమలు చేయడానికి పూనుకోవడం సమంజసం కాదన్నారు. అదేవి ధంగా అసంబద్ధమైన కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సిపిఎస్)ను రద్దుచేసి పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధ రించాలని డిమాండ్ చేశారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లకి పని భారం తగ్గించాలని, జీవో 317లో అన్యాయం జరిగిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, కేజీబీవీ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పిఆర్సి అనుగుణంగా పే స్కేల్స్ వర్తింపజేయాలని, ఇతర టీచర్లకు సమానంగా సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి బి. సాయితేజ, అందోల్ మండ ల అధ్యక్షులు ఏం. శంకర్ నాయకులు ఆయా రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపాల్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.