Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే నెలలో కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ రాక
- మాజీమంత్రి, బీజేపీ నేత పి.బాబు మోహన్
నవతెలంగాణ-జోగిపేట
పార్టీ బలోపేతానికి ప్రతీ ఒక్కరూ కష్టపడి పనిచే యాలని మాజీమంత్రి, బీజేపీ నేత పి.బాబు మోహన్ పిలు పునిచ్చారు. గురువారం అందోల్‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ వద్ద అందోలు నియో జకవర్గం మండల పార్టీ నూతన కమిటీలను ఏకగ్రీవంగా ప్రకటించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెలలో కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ పర్యటన అందోల్ నియోజకవర్గంలో ఉం టుందన్నారు. అందోల్ నియోజకవర్గంలోని చౌటకూర్ మండల శేరి రాంరెడ్డి గూడెం, బద్రి గూడెం గ్రామాలకు చెందిన సుమారు 25 మంది నాయకులు మాజీ మంత్రి బాబు మోహన్ సమక్షంలో బీజేపీలో చేరారు. కాగా అంద లు నియోజకవర్గం కన్వీనర్‌గా పి. ఉదరు బాబు మోహన్, నియోజకవర్గ మీడియా కమిటీ ఇన్చార్జిగా నవీన్ కుమార్, జోగిపేట పట్టణ అధ్యక్షులుగా సయ్య సాయి, అందోల్, చౌటకూర్, పుల్కల్, మునిపల్లి, రాయి కోడ్, రేగోడు, వట్పల్లి, అల్లాదుర్గం, టేక్మాల్ మండలాల అధ్యక్షులుగా శేఖర్ గౌడ్, కే. శేఖర్ గౌడ్, పండరి, సుమన్, సంతోష్, సతీష్ గౌడ్, మధుసూదన్ రెడ్డి, ఆనంద్ శర్మ, రాజులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు. బీజేపీ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్, జగన్నాథం, పార్టీ నాయకులు రమేష్, గోవర్ధన్, కరుణాకర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.