Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మృతుడి కుటుంబానికి రూ.21 లక్షల నష్టపరిహారం
నవతెలంగాణ-బొల్లారం
బొల్లారం పారిశ్రామిక వాడలోని లక్ష్మి సరస్వతి కెమికల్ పరిశ్రమ గోడౌన్లో పనిచేస్తున్న అమన్ మండల్ (29) బుధవారం ప్రమాదవశాత్తు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకుడు, సామా జికవేత్త, మానవతావాది, బీజేపీ సీనియర్ నేత కేజేఆర్ ఆనందకష్ణారెడ్డి పరిశ్రమను సందర్శించి బాధితులను పరామర్శించారు. అనంతరం కౌన్సిలర్ చంద్రారెడ్డితో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో పరిశ్రమ యాజమాన్యంతో చర్చలు జరిపి మతుడి కుటుంబానికి రూ.21 లక్షల నష్టప రిహారం ఇప్పించారు. బీఆర్ఎస్ సీనియర్ నేత, కౌన్సిలర్ చంద్రారెడ్డి,బీఆర్ఎస్కేవి రాష్ట్ర నేత రవి సింగ్, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు రవిందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.