Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొండపాక
గురువారం జిల్లా కలెక్టరేట్ సముదాయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, కీటక జనిత వ్యాధుల నియంత్రణ శాఖ వారి అధ్వర్యంలో ఫైలేరియా ఉచిత మందుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని జెడ్పీ చైర్ పర్సన్, రోజా రాధాకృష్ణ శర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌లు ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జెడ్పీ చైర్ పర్సన్ రోజా రాధాకష్ణ శర్మ, అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కాశీనాథ్ మందులు వేసుకు న్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2 సంవత ్సరాలపై బడిన ప్రతి ఒక్కరు సిబ్బంది సూచించిన విధంగా వారు ఇచ్చే మాత్రలు వేసుకోవాలన్నారు. డాక్టర్ ప్రభాకర్, అధికారులు పవన్ కుమార్ రెడ్డి, వెంకటయ్య, డాక్టర్ విజయ రాణి, డాక్టర్.రజిని డాక్టర్. వినోద్ బాబ్జి, డాక్టర్ అజిముద్దిన్, నవీన్ రాజ్ కుమార్, సిహెచ్ఓ కొండ య్య, ఆర్ బి ఎస్ కే కోఆర్డినేటర్ చక్రధర్, ఎస్ ఓ శ్రీనివాస్, రాజేందర్ ఎన్సీడీ కోఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు.
చిన్నకోడూరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సిద్దిపేట జిల్లా జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ అన్నారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో కూడిన విద్య అలవాటు చేసుకోవాలని సూచించారు. సిద్ది పట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామం లోని ఆదర్శ పాఠశాలలో పైలేరియా మాత్రలను విద్యార ు్థలకు జిల్లా జడ్పీ చైర్ పర్సన్ రోజా రాధాకష్ణశర్మ, ఎంపీపీ కూర మాణిక్య రెడ్డి పంపిణీ చేశారు. మన ఊరు మనబడి కార్యక్రమం కింద పాఠశాలలకు మౌలిక వసతులు కల్పిస్తూ ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకొని పాఠశాలకు, తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురా వాలన్నారు. రెండు సంవత్సరాల పైబడిన వారందరూ తప్పకుండా ఫైలేరియా మాత్రలు వేసుకోవాలన్నారు. పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకు రావాలన్నారు. పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో మంచి మార్కులు సాధించాలని సూచించారు.
కోహెడ : మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో బోదకాలు వ్యాధి నివారణ మాత్రలను పంపిణీ చేశారు. మండలంలోని ఆరేపల్లి గ్రామంలో జాతీయ పైలేరియా వ్యాధి నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్ చేతులమీదుగా ఉచితంగా మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది కొత్తగా ఐదు బోదకాల కేసులు నమోదు అయ్యా యని తెలిపారు. కాగా మన మండలంలో 400 మంది బొదకాల వ్యాదిగ్రóస్తులు ఉన్నారన్నారు. అలాగే మన మండ లంలో అర్హులైన 43,096 మందికిగాను 165 మంది వాలంటీర్స్ పంపిణిలో పాల్గొన్నారని తెలిపారు. రెండు సంవత్సరాల పైబడిన పిల్లల నుండి మొదలుకొని వృద్దుల వరకు ప్రతి ఒక్కరు బోదకాలు రాకుండ డీఈసీ, ఆలె ్బండజోన్ మాత్రలు తీసుకోవాలన్నారు. మూడు రోజుల పాటు ఆశ, వాలంటీర్స్ పంపిణీ చేస్తారన్నారు. అలాగే ఆశ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఆరోగ్య సూపర్వైజర్ల సూచన ప్రకారం వేసుకొని మన మండలంలో బోదకాలు నివారణకు ప్రతి ఒక్కరు సహాకరించాలన్నారు. సర్పంచ్ లావుడ్య సరోజన దేవేందర్, డాక్టర్ విజయరావు, పంచాయతీ సెక్రెటరీ వజీర్మియా, ఏఎన్ఎం స్వరూప, సునీత, ఆశ వర్కర్ లావణ్య తదితరులు పాల్గొన్నారు.
దౌల్తాబాద్ : మలేరియా నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని స్థానిక ఎంపీపీ గంగాధరీ సంధ్యా రవీందర్ అన్నారు. గురువారం మండల కేంద్రమైన దౌల్తాబాద్‌లోని కస్తూర్బా బాలికల వసతి గృహంలో విద్యార్థులకు మలేరియా మాత్ర లను అందజేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభు త్వం ఉచితంగా అందించే ప్రతి కార్యక్రమాన్ని ఉప యోగిం చుకోవాలన్నారు. బోదకాల నివారణకు ప్రభుత్వం ఉచితంగా మందులను పంపిణీ చేస్తుందన్నారు. ఉప సర్పం చ్ల ఫోర ం మండల అధ్యక్షుడు ముత్యంగారి యాదగిరి, కార్యదర్శి యాదగిరి, ఇంచార్జ్ వైద్యాధికారి, సూపర్వైజర్ శ్రీని వాస్, కస్తూర్బా పాఠశాల ప్రత్యేక అధికారి అనురాధ, డాక్టర్ సాగ రిక, పీహెచ్్.ఎన్, గీతా భవాని, సూపర్వైజర్ శ్రీని వాస్, ప్రిన్సిపాల్ అనురాధ ఏఎన్ఎం కరుణకుమారి ఉన్నారు.
దౌల్తాబాద్ : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్ పేర్కొన్నారు. దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఫైలేరియా మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన వారమవుతామని తెలిపారు. సీజనల్ వ్యాధులు రాకుండా ప్రజలను జాగృతం చేయడంలో వైద్య సిబ్బంది మెరుగైన పాత్రను పోషించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి గీత, వైద్య సిబ్బంది ప్రభాకర్, శ్రీనివాస్, రాజు, కరుణ, తదితరులు పాల్గొన్నారు
సిద్దిపేట అర్బన్ : ఫైలేరియా వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అర్బన్ మండల సర్పంచ్ల ఫోరం కార్యదర్శి ఏన్సాన్పల్లి సర్పంచ్ రవీందర్ గౌడ్ అన్నారు. గురువారం సిద్దిపేట అర్బన్ మండలం ఏన్సాన్పల్లి, పొన్నా ల, మిట్టపల్లి గ్రామాలలో ఫైలేరియా వ్యాధి నివారణ మంద ులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు మందులను వాడే విధానాన్ని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నాగుల స్రవంతి ప్రశాంత్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
నంగునూరు : ఫైలేరియా నివారణ అందరి బాధ్యత అని మార్కెట్ కమిటీ చైర్మన్ రాగుల సారయ్య అన్నారు. ఫైలేరియా నివారణ కార్యక్రమంలో భాగంగా గురువారం నంగునూరు మండలం నర్మెట గ్రామంలో ఎండిఏ కార్యక్రమాన్ని మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. మండల వ్యాప్తంగా మూడు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్విని యోగం చేసుకోవాలని కోరారు. గ్రామ సర్పంచ్ అబ్దుల్ అజీద్ అధ్యక్షతన జరిగిన సమా వేశంలో వైద్యాధికారి డాక్టర్ సింధూజ, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రాజిరెడ్డి, నాయకులు పుప్పాల నారాయణ, వైద్య సిబ్బంది హేమలత, హెల్త్ సూపర్వైజర్ వెంకటరమణ, హెల్త్ అసిస్టెంట్లు లింగం, భాస్కర్, ఏఎన్ఎం పద్మ తదితరులు పాల్గొన్నారు.
హుస్నాబాద్ : పరిసరాల పరిశుభ్రత పాటిస్తే దోమల బెడద ఉండదని, తద్వారా వాటితో వ్యాపించే బోదకాలు, ఇతర వ్యాధులు రావని డిప్యూటీ డీఎంహెచ్ వో సౌమ్య అన్నారు. గురువారం ఆమె సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజితతో కలిసి బోదకాలు, నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీని ప్రారంభిం చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ క్యూలెక్స్ దోమ కాటుతో బోదకాలు వస్తుందని, ఆ వ్యాధిగ్రస్తులను కుట్టిన దోమ ఇతరులను కుడితే వారికి వ్యాధి సోకుతుందన్నారు. అందుకే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. హుస్నాబాద్ ఎంపీపీ లకావత్ మానస, కౌన్సిలర్లు కొంకటి నళినీదేవి, వాల సుప్రజ, పెరుక భాగ్య రడ్డి, మాజీ ఎంపీపీ ఆకుల వెంకన్న, ఆసుపత్రి పర్య వేక్షకుడు రమేశ్ రెడ్డి, పీహెచ్ఎన్ సౌందర్య, హెచ్‌ఈవో సంపత్, సూపర్ వైజర్లు కనుకయ్య, గుండమ్మ, డీపీఎం హనుమారెడ్డి, హెల్త్ అసిస్టెంట్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట : పరిశుభ్రతతోనే పైలేరియా మాయం అవుతుందని మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు పట్టణ 24 వ వార్డులో ఇంటింటా తిరుగుతూ ఉచిత ఫైలేరియా మాత్రలను పంపిణీ చేసినట్లు మున్సిపల్ చైర్పర్సన్ కడవేరుగు మంజుల రాజనర్సు తెలిపారు. తననుంచే కార్యక్రమం ప్రారంభం కావాలని ఫైలేరియా మాత్రలను ఆమె వేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దోమ కాటు వలన ఫైలేరియా వ్యాధి సోకుతుందని, దోమలు కాటు వేయకుండా జాగ్రత్తలతో మెలగాలని సూచించారు. ఏఎన్ఎం శ్రీవాణి, సూపర వైజర్ శ్రీధర్, అంగన్వాడీలు శైలజ,భవాని తదితరులు పాల్గొన్నారు.
23వా వార్డులో....
దోమకాటుతోనే ఫైలేరియా వస్తుందని, దోమలు కుట్ట కుండా జాగ్రత్త పడాలని, ముందస్తుగా ప్రభుత్వం అంది స్తున్న గోలీలను వైద్యుల సూచన మేరకు వేసుకోవాలని 23వ వార్డు కౌన్సిలర్ నాయకం లక్ష్మణ్ కోరారు. 23 వార్డు లో ఇంటింటా ఫైలేరియా మందులను పంపిణీ చేశారు. రాసబోయిన యాదగిరి, టౌన్ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి దయాకర్ , పింజర అశోక్ కుమార్, నాయకం నాగేందర్, అత్తిలి కృష్ణ, ఆకుల కనకయ్య, అంగన్వాడి టీచర్ వనిత, వార్డు ఆఫీసర్ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.
జగదేవపూర్ : జగదేవపూర్ మండల వ్యాప్తంగా మండల ఆరోగ్య శాఖ తరుపున విద్యార్థులకు పైలెరియా నివారణ మాత్రలను అందించారు. మండలం కేంద్రంలో గల బాలికల ఉన్నత పాఠశాలలో ఎంపీపీ బాలేశం గౌడ్, బస్వా పూర్లో సర్పంచ్ ఆలేటి మమత ఇంద్రసేనారెడ్డి చేతుల మీదుగా ఫైలేరియా నివారణ మాత్రలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశ ాలల విద్యార్థులు కూడా ఫైలేరియా మాత్రలు వేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఉచితంగా అందజేసే ఈ మాత్రలు తప్పకుండా వేసుకుని విద్యార్థుల ఆరోగ్యానికి తల్లిదండ్రులు కూడా సహకరించాలని తెలిపారు. మండల వైద్యాధికారి మహేష్ కుమార్, మండల కోఆప్షన్ సభ్యులు ఎక్బల్, సిబ్బం ది జితేందర్ రెడ్డి, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
బెజ్జంకి : మద్యాహ్న సమయంలో కుట్టే దోమల వలన మానవులకు వివిధ రకాల వ్యాదులు వ్యాప్తి చెందుతు న్నాయని, దోమల వల్ల సంక్రమించే వ్యాదులలో పైలేరియా(బోద)వ్యాది వ్యాప్తి చెందుతుందని ప్రతి ఒక్కరూ దోమల నుంచి రక్షించుకోవడమే ఉత్తమమని యునాని వైద్యురాలు నజీమున్నీషా తహాసీన్ తెలిపారు. గురువారం మండలంలోని అయా గ్రామాల్లో బోద వ్యాది నివారణ మాత్రలను ఆరోగ్య కేంద్రం సిబ్బంది పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని కేజీవీబీ విద్యాలయంలో విద్యార్థులకు బోద వ్యాది నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని యునాని వైద్యురాలు ప్రారంభించారు. పైలేరియా వ్యాది విముక్తికి మార్గం లేదని, రాకుండా చూసుకోవడమే ఉత్తమ మార్గమని వైద్యురాలు తెలిపారు. ఎంపీపీ, సర్పంచ్, ఆరోగ్య కేంద్రం, కేజీవీబీ విద్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
హుస్నాబాద్ రూరల్ : ఫైలేరియా వ్యాధి చికిత్స చేసుకోవడం కంటే నివారణ చేయడం మంచిదని ఎంపీపీ లకావత్ మానససుభాష్ అన్నారు. గురువారం హుస్నాబాద్ మండలంలోని మీర్జాపూర్, జిల్లెల్లగడ్డ, బల్లునాయక్ తండా గ్రామాలలో ఎంపీపీ లకావత్ మానస సుభాస్ ఫైలేరియా నివారణ మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీప మాట్లాడుతూ ఫైలేరియా వ్యాధిసోకిన వారికి బోదకాలు వస్తుందన్నారు. దోమకాటు ద్వారా ఇది విస్తరిస్తుందని, సాధారణంగా యవ్వన దశలో సోకి పెద్ద వయస ు్సలో లక్షణాలు బయటపడతాయని తెలిపారు. సర్పంచ్‌లు తరాల లతా మహేందర్, లావుడ్యా స్వరూప లింగయ్య, ఇస్లావత్ రజితరాజేంధర్, డాసౌమ్య, వైద్య సిబ్బంది, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, కార్యదర్శులు, ఆశ కార్యకర్తలు, ఏఎఎన్ఎంలు, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.
బోదకాల నిర్మూలన కోసం సర్పంచ్ బత్తుల మల్లయ్య గురువారం ఇంటింటికి మందుల పంపిణీ చేశారు. వైద్య సిబ్బందితో కలిసి సర్పంచ్ మల్లయ్య పైలేరియా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు. పరిశుభ్రత, వ్యాధుల నివారణ చేయడం ద్వారా ఉపయోగాలపై వివరించారు. పంచాయతీ కార్యదర్శి కల్పన, ఆశ వర్కర్ రాజేశ్వరి, అంగన్ వాడి టీచర్, సరోజన తదితరులు పాల్గొన్నారు.
తొగుట : విద్యార్థులకు పైలెరియా మాత్రలు వేస్తున్న సర్పంచ్ పాతుకుల లీలదేవి గురువారం పైలెరియా మాత్రలను పంపిణీ చేసింది.
మద్దూరు : బోదకాల నివారణకు మద్దూరు లద్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని అన్ని గ్రామాలలో ప్రజలకు ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ మలిపెద్ది సుమ మల్లేశంల ఆధ్వర్యంలో ప్రజలకు బోదకాల నివారణకు మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ మెంబర్ ఎండి జిలాని, డాక్టర్ రాజు, సర్పంచులు, ఎంపీటీసీలు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
గజ్వేల్ : గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పరిధిలోని బోదకాల వ్యాధి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ మొదటి వార్డు కౌన్సిలర్ బొగ్గుల చందు అన్నారు. గురువారం వార్డులో బోదకాలు రాకుండా ముందు జాగ్రత్త కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. వార్డులో వైద్యులు ఇంటింటికి తిరిగి బోదకాలు ఉన్నవారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. బోదకాలు ఉన్నవారు జాగ్రత్త పడాలని ఆయన సూచించారు. వైద్యులు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. వైద్యులు, ఆశలు ఇంటికి రాగానే ఇంటిలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వారి దృష్టికి తీసుకురావాలన్నారు.
మర్కుక్ : మండలంలోని ఇప్పలగూడెం వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి, నరసన్నపేట గ్రామంలో సర్పంచ్ కానుగంటి మాదవి రాజారెడ్డి, అంగన్వాడీలోని పిల్లలకు పాఠశాల విద్యార్థులకు బోదకాలు నివారణ మందులను పంపిణీ చేశారు. అనంతరం నర్సన్నపేటలో గ్రామ సర్పంచ్ మాధవి రాజిరెడ్డి హాజరై పిల్లలకు బోదకాలు నివారణ మందులను వేశారు. ప్రాథమిక పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి పిల్లలతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవి, గ్రామ అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్, తదితరున్నారు.