Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండలంలో ఏపుగా పెరుగుతున్న కానోకార్ఫస్ మొక్కలు
- స్వార్థం వీడీ ప్రజారోగ్యాన్ని కాపాడాలని పలువురి విజ్ఞప్తి
నవతెలంగాణ-బెజ్జంకి
భవిష్యత్తులో మానవాళితో పాటు పర్యావ రణానికి కానోకార్ఫస్ మొక్కలు ప్రమాదకరంగా పరిగణిస్తున్నాయని గత మూడు నెలల క్రితం నవతెలంగాణ ప్రత్యేక కథనం ప్రచురించినా ఈ మొక్కల తొలగింపుపై స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు నిర్లక్యంగా వ్యవహరిం చడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల మండల కేంద్రతో పా టు బెజ్జంకి క్రాసింగ్ గ్రామంలో రోడ్డు డివైడర్ మ ధ్యలో లయన్స్ క్లబ్ సౌజన్యంతో నాటిన కానోకా ర్ఫస్ మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. గతంలో కానోకార్ఫస్ మొక్కలు ఏపుగా పెరగడం వల్ల మండల కేంద్రంలో పలువురు వాహనదారులు రోడ్డు దాటే క్రమంలో ప్రమాదాల బారిన పడి తీవ్ర గాయాలైన సంఘటనలున్నాయి. ప్రజాప్రతినిధు లు ప్రజారోగ్యంపై దృష్టి సారించకుండా స్వార్థ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని ఆరోప ిస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల ఆరోగ్యం కాపాడేలా ప్రత్యేక చొరవ చూపి మానవాళికి ప్రమాదరకంగా మారిన కానోకార్ఫస్ మొక్కలను మండలంలో పూర్తిగా తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.