Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడే పోలీసు అమరవీరుల సంస్మరణదినం
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ఒకప్పటి పోలీసు వ్యవస్థకాదు... 'లాఠీలకు కాటిణ్యము న్నా...ఖాకీలకు కణికరముంటది' అన్నట్లుగా ప్రజలకు సేవలందించేలా ఫ్రెండ్లీ పోలీసుగా మారింది. శాంతిభద్రత పరిరక్షణే ధ్యేయంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తోంది. అను నిత్యం అప్రమత్తంగా ఉంటూ ప్రజలు ప్రశాంతంగా జీవిం చేందుకు వీలుగా పహారా కాస్తోంది. ఉగ్రవాదం, తీవ్రవాదం, అసాంఘీక శక్తుల నుండి పొంచి ఉన్న ప్రమాదాలను పసిగట్టి పోరాడడంలో వీరోచిపాత్ర పోషిస్తున్నారు. సరిహద్దుల్లో పహారా కాస్తూ... గల్లీలో గస్తీ తిరుగుతూ సేవలందిస్తున్న పోలీసు వ్యవస్థ అత్యాధునిక పద్ధతుల్లో శాంతిభద్రతలను పరి రక్షిస్తోంది. విధి నిర్వహణలో అనేక మంది గాయాలపా లవ్వడం...ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వారి త్యాగాలను స్మరిస్తూ ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించుకుంటున్నారు.
శాంతిభద్రతల పరిరక్షణ
జనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నారంటే పోలీసులు అప్రమత్తంగా ఉండడం వల్లనే సాధ్యపడుతోంది. ఉగ్రవాదులు, తీవ్రవాదులు, అసాంఘీక శక్తుల నుంచి ప్రజల్ని కాపాడడం కోసం నిరంతరం సేవలందిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సివిల్, ఏఆర్, ట్రాఫిక్, షీటీమ్స్, ఇంటలీజెన్స్, ఐడీపార్టీ విభాగాలతో ప్రజలకు సేవలందిస్తున్నారు. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ మూడు జిల్లాలుగా ఏర్పడిన తర్వాత పెరిగిన మండలాలకు పోలీసు వ్యవస్థ విస్తరించింది. ప్రతి గ్రామానికో పోలీసు చొప్పున శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధులు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా నిత్యం రోడ్లపై విధులు నిర్వహిస్తున్నారు. జాతీయ, రాష్ట్ర రహదారుల్లో ప్రమాదాలు జరగకుండా రెగ్యులర్‌గా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మారకదవ్రాల రవాణాను అరికట్టడం ద్వారా యువత చెబుమార్గాల వైపు మళ్లకుండా చూస్తున్నారు.
బహుముఖ కార్యక్రమాలు
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురష్కరించుకుని తెలంగాణలో ప్లాగ్ డే నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో పోలీసుల సేవలు, త్యాగాలను తెలియజేసే విధంగా ఫొటోగ్రఫీ, మూడు నిమిషాల నిడివిగల షార్ట్ ఫిలిమ్స్ పోటీలను నిర్వహించారు. కొన్ని చోట్ల రక్తదాన శిబిరాలు, మెడికల్ క్యాంపులు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
నలుగురు ప్రాణత్యాగాలు
విధి నిర్వాహణలో భాగంగా తీవ్రవాదులను ఎదుర్కొనే సమయంలో నలుగురు పోలీసులు అసువులుబాశారు. 1992 జులై 13న సిర్గాపూర్ పోలీసుస్టేసన్పై సీపీఐఎంఎల్ మావోయిస్టులు దాడి చేశారు. రాత్రి ఒంటిగంట సమయంలో దాడికి పాల్పడడంతో సెంట్రీ డ్యూటీలో ఉన్న కంది మండలం కాశిపూర్ గ్రామానికి చెందిన కానిస్టేబుల్ జంగయ్యను చంపారు. పోలీసుస్టేషన్లో ఉన్న ఆయుధాలు, మందుగుం డు సామగ్రిని ఎత్తుకెళ్లారు. 1992 డిసెంబర్ 26న మధ్యరాత్రి 25 మంది నేరస్తులు దొంగతనానికి పాల్పడ్డారు. సమాచారం తెలిసిన నర్సాపూర్ మండలం నత్నాయిపల్లికి చెందిన కానిస్టేబుల్ ఎ.ఎల్లయ్య సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అతనిపై ఇనుపరాడులతో దాడి చేశారు. రైఫిల్‌తో కాల్చి చంపారు. అదే విధంగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు 2007 మార్చి 6న ఎ.సత్యనారాయ ణ(అందోల్) అనే పోలీసు కానిస్టేబుల్‌ను హత్య చేసి మృతదేహాన్ని ప్యారారం అటవీ ప్రాంతంలో విసిరేశారు. 2010 మార్చి 30న బీదర్‌లో జరిగిన బాడర్క్రైమ్ సమావేశానికి సంబంధించి డ్యూటీపై జే.సురేష్ (కోహీర్ మండలం గుర్జువాడ) కానిస్టేబుల్ బీదర్‌కు వెళ్తుండగా మార్గమధ్యంలో నాగూర్-కె గ్రామం వద్ద నిందితులు కూడా అక్కడికి వెళ్తున్నారు. నిందితుడిపై ఎన్బీడబ్యూ పెండింగ్‌లో ఉన్నందున కానిస్టేబుల్‌ను చూసి అతను పారిపోయాడు. దీంతో కానిస్టేబుల్ నిందితుడిని పట్టుకునేందుకు వెంబడించాడు. ఆ నిందితుడు కానిస్టేబుల్‌పై రాయితో దాడి చేయడంతో సురేష్ అక్కడికక్కడే మరణించారు.
సంస్మరణ దినం నేపథ్యం
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నేపథ్యం లోకి వెళ్లితే... 1959 అక్టోబర్ 21న దేశ సరిహద్దు లడక్ సమీపంలో హటిస్ప్రింగ్గా గుర్తింపు పొందిన అక్వాచింగ్ సమీపంలో చైనా బలగాలు దాడి చేశాయి. ఆ సమయంలో సరిహద్దుల్లో కాపలాగా ఉన్న 10 మంది భారత జవాన్లు శత్రువుల దాడిని తిప్పికొట్టేందుకు విరోచితంగా పోరాడారు. తమ కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న చైనా సైనికులతో పోరాడి ఎదిరించారు. ఆ యుద్ధంలో 10 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు వదిలారు. వారి త్యాగానికి గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినం నిర్వహిస్తున్నారు.
అనునిత్యం అప్రమత్తం
ప్రజలకు సేవలందిస్తూ శాంతిభద్ర తల్ని కాపాడేందుకు పోలీసులు అనుని త్యం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదం, తీవ్రవా దం, అసాంఘీక శక్తుల నుండి ప్రజల్ని కాపాడే బాధ్యతలో విధి నిర్వహణలో అనేక మంది పోలీసులు ప్రాణాలు కోల్పోతున్నారు. వారి త్యాగాలకు వెలకట్టలేం. ప్రజలతో మమేకమవుతూ ఫ్రెండ్లీ పోలీసుగా పని చేస్తున్నారు. అమరుల్ని స్మరిస్తూ శుక్రవారం పరేడ్ గ్రౌండ్లో జెండాను ఆవిష్కరిస్తాం. అమరుల కుటుంబాలకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాలుంటాయి. ఫొటోగ్రఫీ, షార్ట్‌ఫిలిం పోటీల విజేతలకు బహుమతులు అందజేస్తారు. అక్టోబర్ 21 ప్లాగ్ డే స్ఫూర్తితో మరింత అంకిత భావంతో విధులు నిర్వహిస్తాం.
- రమణకుమార్, సంగారెడ్డి ఎస్పీ