Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిరుదొడ్డి
డీఈసీ మాత్రలతోనే ఫైలెరియా వ్యాధి అంతం అవుతుందని సిద్ధిపేట డిప్యూటీ డిఎంహెచ్‌ఒ డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మిరుదొడ్డి పీహెచ్సీి పరిధిలోని వివిధ గ్రామాల్లో నిర్వహిస్తున్న ఎండిఎ కార్యక్ర మాన్ని ఆయన పర్యవేెక్షించారు. అల్వాల్ హాస్టల్లో విద్యారు ్థలకు మాత్రలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమ కాటు వల్ల ఫౖౖెలెరియా వ్యాధి సోకుతుందని దీంతో కాళ్ళు, చేతులు మాత్రమే కాకుండా శరీరంలోని ఇతర అవయవాలు కూడ వాచి ఇబ్బందిగా మారుతుందన్నారు. దోమకాటు తర్వాత ఫైలెరియా వ్యాధి లక్షణాలు కనబడటానికి సంవత్సరాల కాలం పడుతుం దన్నారు. వ్యాధికారక క్రిములను చంపివేయడానికి ఈ మాత్రల పంపిణి జరుగుతుందని వివరించారు. రెండేండ్ల పై బడిన వారందరు మాత్రలు తప్పకుండ మింగాలని పేర్కొన్నారు. ఈ కార్య క్రమములో వైద్యాధికారి విజ్మొహన్ రెడ్డి, అనుదీప్, సీహెచ్ఒ లింగమూర్తి, హెచ్ఇ సత్యనా రాయణ, సిబ్బంది రవి, సుధ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు కొండాపూర్, మిరుదొడ్డిలో ఇంటింటికి తిరిగి మాత్రల పంపిణి కార్యక్రమాన్ని తనిఖీ చేశారు.
నవతెలంగాణ-నంగునూరు: జాతీయ ఫైలేరియా వ్యాధి నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ఫైలేరియా బోదకాల వ్యాధి నియంత్రణకు డీఈసీ మాత్రలను శుక్రవారం నంగునూరు ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం రజిత మాట్లాడుతూ రెండు సంవత్సరాలు దాటిన విద్యార్థులందరికీ మాత్రలు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మనీష్ కుమార్, ఉన్నత పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు రవీందర్ రెడ్డి, ఉపాధ్యాయులు తిరుపతి, నగేష్, రాజీరెడ్డి, తహసిన్ సుల్తాన్, శనిగరం కనకయ్య, అంగన్వాడి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
నవతెలంగాణ-మద్దూరు: బోదకాలు నివారణ కార్యక్రమంపై పర్యవేక్షణకు రాష్ట్ర డబ్ల్యూహెచ్‌వో టీం మెంబెర్ సత్యనారాయణ మండల కేంద్రం తో పాటు గాగిల్లాపూర్ గ్రామంలో ఆకస్మికంగా పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో జరుగుతున్న బోదకాల మాత్రల పంపిణీ పరిశీలించినట్లు ఆయన తెలిపారు ప్రతి ఒక్కరు బోదకాల నివారణ కోసం మాత్రలు వేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్ర మంలో డాక్టర్ రాజు, సబ్ యూనిట్ ఆఫీసర్ రామ్మూర్తి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
నవతెలంగాణ-తొగుట: ఫైలెెరియా వ్యాధి నివారణ కోసం ప్రతిఒక్కరు మాత్రలు మింగాలని జిల్లా ఇమినైజేషన్ అధికారి డాక్టర్ విజయ రాణి అన్నారు. శుక్రవారం రెండవ రోజు తొగుట, చందాపూర్,పెద్ద మసాన్ పల్లి గ్రామా లలో బొద వ్యాధి నిర్మూలన మాత్రల పంపిణీ కార్యక్ర మాన్ని పరిశీలించారు. టీం సభ్యుల ద్వారా మాత్రల వినియోగాన్ని క్రాస్ చెక్ చేశారు. అనం తరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ ఫైలేరియా నివారణ మాత్రలు మింగాలని సూచించారు. వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు తగు జాగ్రత్త లు తీసుకోవాలని కోరారు. ఆమె వెంట వైద్యాధికారి డాక్టర్ వి.శృతి, హెల్త్ సూపర్్వైజర్ స్వ్వామి, ఏఎన్ఎం రజిని, టీం సభ్యులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-సిద్దిపేట: రెండవ రోజు ఫైలేరియా ఉచి త మందుల పంపిణీని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్ట ర్ కాశీనాథ్ ఆకస్మికంగా పట్ట ణంలో ఓల్డ్, న్యూ బస్టాండ్ ఏరియాలో తనిఖీ చేశారు. ఎండీఏ కార్యక్రమం పని తీరు ను పర్యవేక్షించడంతోపాటు, 100 శాతం ప్రజలు మందులు మింగేందుకు సిబ్బందికి పలు సలహాలు, ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫైలేరియా వ్యాధి నిర్మూలనలో భాగంగా ప్రజలు మందులు మింగడం తప్పనిసరన్నారు. తద్వారా ఫైలేరియా రహిత జిల్లాగా చేయవచ్చని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైద్య శాఖ సిబ్బంది, పాల్గొన్నారు.
నవతెలంగాణ-మర్కుక్: బోదకాల నివారణ మాత్రలు రెండు సంవత్సరాల పైబడిన వారందరూ తప్పనిసరిగా వేసుకోవాలని వైద్యాదికారి డా.శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మర్కుక్‌లోని కస్తూర్బా పాఠశాలలోని విద్యార్థులకు బోదకాల నివారణకు మాత్ర లను పంపిణీ చేశారు. మండల కేం ద్రమైన మర్కుక్‌లో గ్రామ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్ అంగన్వాడీలోని పిల్లలకు పాఠశాల విద్యార్థులకు బోదకాలు నివారణ మందు లను పంపిణీ చేశారు. ఈ కార్యక్ర మంలో డా.సౌజన్య, షకీల్, ఎఎన్ఎమ్ స్వప్న, గ్రామ అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్ రాణి, గీత, సునీల్, నాయకులు మొర్సు శ్రీనివాస్, ర్యాకం స్వామి, పాపోల్ల రాజులు ఉన్నారు.