Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మద్దూరు
పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేని అని మద్దూరు ఎస్సై నారాయణ అన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా మద్దూరు అంబేద్కర్ చౌరస్తా నుంచి అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ నిర్వహించి స్తూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జనార్దన్ రెడ్డి, ఉప సర్పంచ్ ఎండి ఆరిఫ్, ఏఎస్ఐ జిల్లా జగదీశ్వర్, నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-గజ్వేల్
జాతీయ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ సేవలను గుర్తు చేస్తూ గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థక, అధ్యక్షులు రామకోటి రామరాజు పోలీస్ అమరవీరుల స్తూపాన్ని ఆవాలతో 6 అడుగుల అద్భుత చిత్రాన్ని చిత్రించారు. శుక్రవారం ఆ చిత్రానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య రక్షణే పరమావధిగా, సమాజ శ్రేయసస్సే ఊపిరిగా, ప్రజల కొరకు ప్రాణాలనే పణంగా పెట్టిన వారన్నారు. అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న ప్రతి పోలీసుకూ కృతజ్ఞతాంజలి సమర్పిస్తూ ఈ చిత్రాన్ని వారికి అంకితమిస్తున్నానన్నారు.
నవతెలంగాణ-సిద్దిపేట
పోలీస్ అమరవీరుల సేవలు చిరస్మరనీయమని కొమురవెల్లి దేవస్థానం డైరెక్టర్ మరుపల్లి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని సిద్దిపేట మోడల్ బస్టాండ్ వద్ద పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధినిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిం చుకోవడం మనందరి బాద్యత అన్నారు. పోలీసు అమరవీరుల కుటుం బాలకు ప్రభుత్వం అండ గా నిలుస్తుం దన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గ్యాదరి రవి, టీఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.