Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు న్యాయవాది సామలేటి లక్ష్మీనారాయణ
నవతెలంగాణ-సిద్దిపేట
పర్యావరణ హితం కోసం అందరూ కృషి చేయాలని హైకోర్టు న్యాయవాది, పర్యావరణవేత్త సామలేటి లక్ష్మీనారాయణ కోరారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళి సందర్భంగా నిర్వహించుకునే పండుగ పర్యావరణహితంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ ఇంటి ముందు, వ్యాపార సముదాయాల దగ్గర దీపాలు వెలిగించి పర్యావరణహిత దీపావళి పండుగను నిర్వహించుకోవాలని కోరారు. శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం లేని పటాకులు పేల్చి దీపావళి పండుగను ఘనంగా, ఆనందంగా జరుపుకోవాలని కోరారు. అలాగే కేవలం ఒకరోజు దీపావళి రోజు పటాకులు పేల్చడం వల్లే పర్యావరణం చెడిపోతుందని అనడం కాకుండా సమాజంలోని ప్రముఖులు, వీఐపీలు, సినీ, రాజకీయ , క్రీడా రంగాలకు సంబంధించిన ప్రముఖులు సంవత్సరం పొడవునా వివిధ సందర్భాల్లో బాణ సంచాలు పేల్చి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అటువంటివారు సైతం ఈ బాణ సంచాలకు స్వస్తి పలికి పర్యావరణహితానికి పాటుపడాలని కోరారు. ఇక తమవంతుగా పర్యావరణ హితం కోసం ఇక ధ్వని, వాయు కాలుష్యానికి కారణభూతమైన టపాకాయలను కూడా బహిష్కరించి, పర్యావరణహిత పండుగను జరుపుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ద్యావనపల్లి సత్యనారాయణ, రచ్చ సంగీత, న్యాయవాదులు వర్కొలు రాజలింగం, తిరుపతి రెడ్డి, రాజేష్ గౌడ్, టి.రాజు గౌడ్, కే.రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.