Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జే పాటిల్
నవతెలంగాణ-కొండపాక
జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జే పాటిల్ మన ఊరు మన బడి పథకంపై శుక్రవారం అధికారులు, ప్రజాపప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో ఆయన మాట్లాడుతూ జిల్లాలో మన ఊరు-మన బడి పథకంలో ఎంపికైన పాఠశాలల్లో ఇప్పటి వరకు జరిగిన పనులకు సంబంధించి 3 రోజుల్లోగా ఈఈ, డిఈ, ఎఈ లు పర్యవేక్షణలో రికార్డ్ చేసి ఆన్లైన్ చేయాలని ఆదేశించారు. కాంట్రాక్టర్ లు బిల్లుల విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. ప్రతి పాఠశాలల్లో పర్యవేక్షణ చేసి పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లు టెండర్ పనులు పూర్తి చేసెందుకు ఎవైనా సాంకేతిక సమస్యలు ఉంటే డీఈ, ఎఈలు పరిష్కరించాలన్నారు. ఈ పథకం లో చేర్యాల మండలంలో కడవెర్గు గ్రామంలో ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఎస్ఎమ్ సి చైర్మన్ లు మంచి పట్టుదల సమన్వయం తోపనులు పూర్తి చేసినందుకుగాను అభినందించారు. ఎన్ఆర్ఈజీయస్, ఈ జీఎస్ కింద చేసే పనులు మరుగుదొడ్లు, వంటగది తప్పనిసరిగా పూర్తి చేయాలన్నారు. భోజనశాల, అదనపు తరగతి గదులు, ప్రహారిగోడ, సంపు లాంటి ఇతరత్రా పనులు పూర్తి చేయాలన్నారు. డీఈఓ శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.