Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంగారెడ్డి జిల్లా ఎస్పీ యం.రమణ కుమార్
- ఘనంగా పోలీసు ఫ్లాగ్ డే
నవతెలంగాణ-సంగారెడ్డి
విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమర వీరుల త్యాగాలు మరువలేనివని సంగారెడ్డి జిల్లా ఎస్పీ యం.రమణ కుమార్ అన్నారు. పోలీస్ ఫ్లాగ్ డేను పురస్క రించుకొని జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో స్మృతి పరేడ్ నిర్వహించి, అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. 21 అక్టోబర్ 1959 సంవత్సరంలో సిఆర్పిఎఫ్ ఎస్ఐ కరమ్ సింగ్ నాయకత్వంలోని 20 మంది భారత జవాన్లు కలసి లడక్ ప్రాంతంలో హాట్స్ట్రింగ్ వద్ద విధులు నిర్వహిస్తుండగా.. చైనా ఆర్మీ దొంగ దాడి చేసి 10 మందిని హతమార్చిందన్నారు. అప్పటి నుండి దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతీయేడాది అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం (పోలీస్ ఫ్లాగ్ డే)గా పాటిస్తున్నామన్నారు. దేశం కోసం విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేస్తారో.. వారి ప్రాణ త్యాగాలను స్మరిస్తూ పోలీస్ ఫ్లాగ్ డేగా పాటిస్తున్నా మన్నారు. అందులో భాగంగానే జిల్లాలో విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన త్యాగమూర్తుల కుటుంబాలను కలిశామ న్నారు. అనంతరం అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలను అందించారు. పోలీసుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ అక్టోబర్ 21 నుండి సర్దార్ వల్లభారు పటేల్ జయంతి అయిన అక్టోబర్ 31వ తేదీ 'జాతీయ ఐక్యత దినోత్సవం' వర కు ప్రజలకు పోలీసులు మరింత చేరువయ్యేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. సంగారెడ్డి డీఎస్పీ రవీంద్రా రెడ్డి, జహీరాబాద్ డీఎస్పీ రఘు, ఎస్బీ ఇన్స్పెక్టర్స్ మహేష్ గౌడ్, సంగారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్, ఉమెన్ పిఎస్ ఇన్స్పెక్టర్ హేమరాణి, ఆర్ఐలు కృష్ణ, డానియెల్, అమరుల కుటుంబ సభ్యులు హాజరై నివాళ్లర్పించారు.
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సంద ర్భంగా ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్ వద్ద ఉన్న పోలీసు అమరవీరుల స్తూపానికి పూల మాల వేసి నివాళ్లర్పించారు. అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర, ఉపాధ్యక్షుడు సజ్జాద్‌ఖాన్, ప్రధాన కార్యదర్శి మహేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పటాన్చెరు : శాంతిభద్రతలు బాగుంటేనే సమాజం అభివృద్ధి దిశలో ముందుకు వెళ్తుందని, తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని.. పటా న్చెరు డీఎస్పీ భీమ్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని మైత్రి గ్రౌండ్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు అమరవీరుల దినోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గూడెం మధుసూదన్ రెడ్డితో పాటు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. పటాన్ చెరు తహసీల్దార్ మహి పాల్ రెడ్డి, బల్దియా డిప్యూటీ కమిషనర్ బాలయ్య, ఎంఈఓ రాథోడ్, సిఐలు వేణుగోపాల్ రెడ్డి, బీసన్న, శ్రీనివాస్ రెడ్డి, వినాయక్ రెడ్డి, సురేందర్ రెడ్డి, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
సదాశివపేట : విధి నిర్వాహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులకు పట్టణంలోని పోలీస్ స్టేషన్లో నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సి.ఐ నవీన్ కుమార్, ఎస్సై నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.