Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పటాన్చెరు
నూతన టెక్నాలజీని అందిపుచ్చుకున్నప్పుడే మనం ఎంచుకున్న రంగంలో రాణించేందుకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఫోటో-వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం, పటాన్చెరు ఫోటోఅండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం అధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సెమినార్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి నియోజకవర్గంలోని ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారన్నారు. ఫోటోగ్రఫీ రంగంలో వస్తున్న నూతన టెక్నాలజీ పై ప్రముఖ ఫోటోగ్రాఫర్లతో వర్క్ షాప్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. భవిష్యత్‌లో ఫోటోగ్రాఫర్లకు అండగా నిలుస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్, రాష్ట్ర సంఘం కోశాధికారి మున గాల శైలేందర్, గ్రేటర్ హైదరాబాద్ సంఘం అధ్యక్షుడు శేఖర్, ప్రధాన కార్యదర్శి నక్క సంజీవ్ కుమార్, కోశాధికారి గడ్డం లక్ష్మారెడ్డి, స్థానిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.