Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -కంగ్టి, కొండాపూర్, నారాయణఖేడ్
నారాయణఖేడ్ ప్రాంతంలోని ఎన్కెమూరు గ్రామంలో గత 15 రోజుల క్రితం అంబేద్కర్ నీలి జెండాను కొందరు కాలికింద వేసి తొక్కి అవమానించారని.. అయితే ఆ దుండగుల మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయకుండా.. వివక్షకు గురైన 8మంది దళితులపైనే అక్రమ కేసు బనాయించారని కేవీపీఎస్ కంగ్టి నాయకులు కొఠారి నర్సింలు, మోహన్, కేవీపీఎస్ కొండాపూర్ మండల కార్యదర్శి వి.రామచందర్, బీఎస్పీ ఖేడ్ నాయకులు అనుముల తూకరం, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు కె.శ్రీనివాస్‌లు వేర్వేరు సమావేశాల్లో ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళితులపై అక్రమంగా కేసులు పెట్టిన సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ, ఏఎస్సై, సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని యెడల పెద్ద ఎత్తున దళితులను సమీకరించి ఉద్యమిస్తామని హెచ్చరించారు. కేవీపీఎస్ నాయకులు అనిల్, రత్నయ్య, పౌలు రాజయ్య, బాబురావు తదితరులు పాల్గొన్నారు.