Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అమీన్పూర్
రోజు రోజుకి అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని ప్రతీ ఇంటికి మిషన్ భగీరథ ద్వారా రక్షిత మంచినీరు అందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి తెలిపారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 17వ వార్డు ఆర్ఆర్ హౌమ్స్లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్ర మంలో ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పథకం ద్వారా మున్సిపల్ పరిధిలో మూడు భారీ రిజర్వాయర్లు నిర్మిస్తున్నామన్నారు. వీటి నిర్మాణం పూర్తయితే ప్రతి ఇంటికి మిషన్ భగీరథ మంచినీటి కనెక్షన్ అందిస్తామన్నారు. మున్సిపల్ పరిధిలో మౌలిక సదుపా యాల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన రూ.25 కోట్లతో ప్రతీ కాల నీలో సీసీరోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువలు నిర్మిస్తు న్నామన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగ స్వాములు కావాలని కోరారు. స్థానిక కౌన్సిలర్లు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.