Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్బందులు పడుతున్న గర్భిణులు
- పడకలు లేవని.. సొంతంగా నడిపిస్తున్న ప్రయివేటు ఆసుపత్రికి గర్భిణులను తరలిస్తున్న వైద్యులు
- ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి
- కేవీపీఎస్ మండల కార్యదర్శి రామ్ చందర్
నవతెలంగాణ -కొండాపూర్
మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనీస సౌకర్యాల లేమితో పాటు సిబ్బంది, వైద్యులు అందుబాటులో ఉండకపోవడంతో గర్భిణీలు తీవ్రంగా ఇబ్బందులు పడుతు న్నారని కేవీపీఎస్ మండల కార్యదర్శి రామ్ చందర్ అన్నారు. ప్రభుత్వాస్పత్రిలో పడకలు లేవనే సాకుతో.. సొంతంగా నడిపిస్తున్న ప్రయివేటు ఆసుపత్రికి గర్భిణులను వైద్యులు రిఫర్ చేస్తారని ఆరోపించారు. వెంటనే ఉన్నతా ధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కేవీపీఎస్ కొండాపూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సర్వే నిర్వహించారు. అనంతరం రామ్ చందర్ మాట్లాడుతూ.. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనీస సౌకర్యాలు లేక.. సిబ్బంది వైద్యులు అందుబాటులో ఉండక గర్భిణీలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. గర్భిణ ీలకు రక్త పరీక్షలు సైతం బయటే చేయించుకోవాల్సి వస్తున ్నదని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్పిటల్లో ల్యాబ్ ఉన్నప్పటికీ పరీక్షలు నామమాత్రంగానే నిర్వహిస్తున్నారని మండి పడ్డారు. కాగా ఆసుపత్రిలో ఆరు పడకల సదుపాయం మాత్రమే ఉండడం ఆశ్చర్యమన్నారు. దీనిని సాకుగా తీసుకొని స్థానిక డాక్టర్, మెడికల్ ఆఫీసర్ తమ సొంత ఆస్పటల్ అయినా ధృవ మల్కాపూర్‌కు గర్భిణీలను తరలించి వేల రూపంలో ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిం చారు. వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 50 పడకల ఆస ుపత్రిగా మార్చాలని డిమాండ్ చేశారు. మండల వ్యాప్తంగా సబ్ హెల్త్ సెంటర్ నిర్వాహణలో నిర్లక్ష్యం వహిస్తున్న ఏఎ న్‌ఎంలు.. డెలివరీ సమయంలో డబ్బులు వసూలు చేస్తున్న సిబ్బంది పైన చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని గ్రామాల్లో ఆశా కార్యకర్తలు బిపి, షుగర్, రోగులకు మందులను సైతం ఇవ్వట్లేదని.. గర్భిణీల పట్ల కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారని.. వారిని వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. అలాగే విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న స్థానిక డాక్టర్‌పై, హాస్పటల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు. లేనియెడల కేవీపీఎస్ కొండాపూర్ మండల వ్యాప్తంగా బాధితులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్త్తామని హెచ్చ రించారు. కేవీపీఎస్ నాయకులు మధు, ప్రవీణ్, శీను, సత్త య్య, రమేష్, సంజీవులు, ఎల్లేష్ తదితరులు పాల్గొన్నారు.