Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖరీఫ్ వరి కోతలు షురూ
- ఆరుబయటే ధాన్యం రాసులు
- ఎడతెరపిలేని వర్షాలు...
- మిల్లుల్లో ధాన్యం నిల్వలు
- నేటి నుండి ధాన్యం కొనుగోళ్లు
ఏటా ఖరీఫ్, యాసంగీ సీజన్లలో వరి ధాన్యం కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం సరిపడ గోదాముల్ని నిర్మించడంలో శ్రద్ద చూపట్లేదు. ఇప్పటికీ ధాన్యం కొనుగోళ్లను ఆరుబయటే నిర్వహిస్తున్నారు. లక్షలాది మెట్రిక్ టన్నుల ధాన్యం పండితున్న వేళ వాటిని నిల్వ చేసే సామర్ధం మేరకు గోదాముల్లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులేర్పడు తున్నాయి. మిల్లులన్నీ ధాన్యం నిల్వలతో నిండి ఉన్నాయి. గోదాముల్లో రేషన్ బియ్యం ఇతర సరుకులున్నాయి. కొనుగోలు కేంద్రాలలో గోదాములు, షెడ్లు నిర్మించాలని గతంలో నిర్ణయించినా ఆచరణకు నోచలేదు. దీంతో ప్రతి సీజన్లో ధాన్యం తడిసి నష్టమేర్పడుతోంది.
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వరి సాగు ఏటేటా పెరుగుతోంది. కాలేశ్వరం, ఇతర సాగునీటి వనరులు పెర గడం, అధిక వర్షాపాతం నమోదుకావడం, ఉచిత కరెం ట్ ఇవ్వడంతో వరి సాగు పెరుగుతోంది. ఆ మేరకు ధాన్యం దిగుబడులు కూడా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో వరి సాగు రెట్టింపు అయ్యింది. సాగుతీరు చూస్తే సిద్దిపేట జిల్లాలో 361000 ఎకరాల్లో వరి సాగవ్వగా 9.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రానుంది. మెదక్ జిల్లాలో 117000 ఎకరాల్లో వరి వేయగా 7.99 లక్షల మెట్రిక్ టన్నులు, సంగారెడ్డి జిల్లాలో 56335 ఎకరాల్లో వరి సాగైనందున 3.15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగు బడులు వస్తాయని అధికారులు అంచనా. మూడు జిల్లాల్లో కలిసి 534335 ఎకరాల్లో వరి సాగవగా 20.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు రానున్నాయి.
గ్రామీణ గోదాముల్లేక ఇబ్బందులు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామీణ గోదాములు నిర్మించాల్సిన అవసరముంది. ధాన్యం కోనుగోలు కేంద్రాల్లోనే గోదాములు, షెడ్లు నిర్మించాలని గతంలో నిర్ణయించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేయడం, ధాన్యం రాసుల్ని షెడ్ల కింద పోసుకోవడం కోసం ఇవి ఉప యోగపడతాయని చెప్పారు. నిధులు కేటాయించి, స్థలాల్ని కూడా గుర్తించారు. ఇప్పటి వరకు ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాల్లో గోదాములు, షెడ్లు నిర్మించలేదు. అదే విధంగా మార్కెటింగ్ శాఖ ద్వారా గోదాముల్ని మంజూరు చేశారు. సిద్దిపేట జిల్లాలో లక్షా 25 వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో 19 గోదాములు, సంగారెడ్డి జిల్లాలో 75 వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో 19 గోదాములు, మెదక్ జిల్లాలో 70 వేల మెట్రిక్ టన్నుల సామమర్ధ్యంతో 12 గోదాముల్ని నిర్మించాల్సి ఉంది. ఇవి పూర్తికాకపోవడంతో ధాన్యం నిల్వ చేయడం కష్టంగా మారింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 912 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోళ్లు కేంద్రాలు పెడుతున్నారు. వీటిల్లో రైతులు ధాన్యాన్ని ఆరుబయటే రాస్తారు. ఈ కేంద్రాల్లో గ్రామీణ గోదాములు, షెడ్లు నిర్మించాలని రైతులు కోరుతున్నారు.
ఖరీఫ్ సీజన్ కొనుగోళ్లకు ఏర్పాట్లు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి నుంచే ధాన్యం కొనుగోలు కేంద్రా లను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు సివిల్ స ప్లయి, డీఆర్డీఎ, డీసీఎంస్, పీఎసీఎస్‌లు ఏర్పాట్లు చేస్తు న్నాయి. మెదక్ జిల్లాలో 346 కేంద్రాల ద్వారా 639000 మెట్రిక్ టన్నులు, సిద్దిపేట జిల్లాలో 411 కేంద్రాల నుండి 5 లక్షల మెట్రిక్ టన్నులు, సంగారెడ్డి జిల్లాలో 155 కేంద్రాల ద్వారా 2.52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు కేంద్రాలను ప్రారంభించనున్నారు.
వర్షాలు...తార్పాలిన్లు కొరత
వరి కోతలు షురూ అయ్యాయి. రైతులు మిషన్లు పెట్టి కోతలు కోస్తున్నారు. ధాన్యాన్ని తెచ్చి కొనుగోలు కేంద్రాల్లో ఆరపోస్తున్నారు. ధాన్యం పోసుకునేందుకు అవసరమైన తార్పాలిన్లు అందుబాటులో ఉన్నా అవి అవసరాలకు సరిపడవు. ఇప్పటికే తార్పాలిన్లు కొన్నామంటున్నారు. అవి రైతులకివ్వకపోయే సరికి ధాన్యం కిందనే పోస్తున్నారు. ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో ధాన్యం తడుస్తోంది. తేమ శాతం 17 దాటితే కొనుగోలు చేయరు. వర్షాల వల్ల ధాన్యం ఆరబోసుకోవడం చాలా కష్టమవు తుందని రైతులు వాపోతున్నారు. తార్పాలిన్లు ఇస్తే రాసుల పై కప్పుకుంటామని చెబుతున్నారు.
మిల్లుల్లో ధాన్యం నిల్వలు
కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేసేందకు స్థల సమ స్య ఎదురవుతోంది. యాసంగీ, ఖరీఫ్‌లో సేకరించిన ధాన్యం నిల్వలు మిల్లుల్లో పేరుకుపోయాయి. మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, సిద్దిపేట ప్రాంతాల్లో మిల్లుల్లో ధాన్యం నిల్వ లు న్నాయి. కేంద్రం కొర్రీలు పెట్టడం వల్ల ధాన్యం ఖాళీ కాలేదు. ఖరీఫ్ ధాన్యం తీసుకుని ఎక్కడ పెట్టాలని మిల్లర్లు వాపో =తున్నారు. ఈ సారి మిల్లులకు కాకుండా మిడిల్ పాయిం ట్లలో నిల్వ చేయాలని బావించినా వాటిని ఏర్పాటు చేయడం లోనూ ఇబ్బందులున్నాయని అధికారులు చెబుతున్నారు.