Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారుల నిర్లక్ష్యంతోనే కుంటుపడుతున్న అభివృద్ధి
- డివిజన్, మండల స్థాయి అధికారులపై కలెక్టర్ ఫైర్
నవతెలంగాణ-జహీరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల అమలులో జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల డివిజన్ స్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడికక్కడ కుంటుపడుతు న్నాయని జిల్లా కలెక్టర్ ఆగ్రహ వ్యక్తం చేశారు. పనివి ధానంలో మార్పు రాకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చ రించారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ సమావేశ మంది రంలో అదనపు కలెక్టర్లు రాజర్జి షా, వీరారెడ్డి, జెడ్పీసీఈఓ ఎల్లయ్యలతో కలిసి జిల్లా కలెక్టర్ శరత్ సమీక్షా సమావేశం నిర్వహించారు. తరచుగా వివిధ శాఖల అధికా రులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ.. తాను గానీ, రాజర్జి షా గానీ కదిలిస్తే తప్పా డివిజన్, మండల స్థాయి అధికారుల్లో ఏ విధమైన చలనం లేకపోవడం బాధాకర మన్నారు. మనమందరం ప్రజా సేవకులమని.. ప్రభుత్వాలు తీసుకువస్తున్న సంక్షేమ పథకాలను వారి వద్దకు చేర్చేందుకు అందరూ తమ తమ స్థాయిల్లో కృషి చేయాలన్నారు. అప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరడంతో పాటు అర్హులైన వారికి సాయాన్ని అందించిన వారవుతామన్నారు. జహీరాబాద్ డివిజన్ స్థాయి, మండల స్థాయి అధికారుల నిర్లక్ష్యం కార ణంగా ఎన్నో సంక్షేమ పథకాలు కుంటుపడుతు న్నా యనా ్నరు. ఇప్పటికైనా వారి పని విధానంలో మార్పు తీస ుకురాy ాలని హెచ్చరించారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవ న్నారు. తరచుగా మంత్రులు జిల్లా స్థాయి అధికా రులు సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ అభివృద్ధి కార్యక్ర మాల్లో చలనం ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. అధి కారు లకు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా సంప్రదించి వాటిని ఎక్కడికక్కడ పరిష్కరిస్తే తప్పా.. పరిష్కారం కావ న్నారు. అధికారులందరూ బాధ్యతగా విధులు నిర్వహిస్తూ తమ తమ శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పట ికప్పుడు, ఎక్కడికక్కడ నివేదికలను అప్లోడ్ చేయాలని సూచి ంచారు. ఆర్డిఓ రమేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ సుభాష్ రావు డివిజనల్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.