Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంగారెడ్డిలో బంధువుల హడావుడి
- డైరెక్టర్ అనుదీప్ ఆర్కె మూడో సినిమా
- హిట్ కొట్టిన పిట్టగోడ, జాతిరత్నాలు
- మూడు సినిమాలకూ ప్రేక్షకాధరణ : బంధువులు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రేక్షకుల అభిరుచి, ఆసక్తికి తగ్గట్టుగా సినిమాలు తీయడంలో దర్శకులు అనుదీప్ ఆర్కె సక్సస్ అవుతున్నారు. 'పిట్టగోడ' 'జాతిరత్నాలు' సినిమాలు డైరెక్టర్ పని తీరును రుజువు చేశాయి. ఆ రెండు సినిమాలు ప్రేక్షకాధరణ పొందా యి. సినీ పరిశ్రమలో అనుదీప్‌కు గుర్తింపు తెచ్చాయి. మూడో సినిమా 'ప్రిన్స్' శుక్రవారం విడుదలైంది. తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్న విజయకార్తికేయన్ హీరోగా ప్రిన్స్ సిని మా తీశారు. దర్శకులు అనుదీప్‌ది సంగారెడ్డిలోని ఆందో ల్-జోగిపేట కావడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆయన సినిమాలను యువకులు, పిల్లలు, పెద్దలు అందరూ ఆధరి స్తున్నారు. గతలంలో తీసిన జాతిరత్నాలు సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అదే మాదిరి మూడో సినిమా ప్రిన్స్ విడుదలైన సందర్భంగా సంగారెడ్డి పట్టణ ంలోని సితారా థియేటర్లో దర్శకులు అనుదీప్ ఆర్కె కుటు ంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అభిమానులు సంద డి చేశారు. సినిమా మొదటి షో ప్రారంభం సందర్భంగా థియేటర్ వద్ద భారీగా బాణా సంచ కాల్చి సంబరాలు చేశారు.. ముందే టికెట్లను బుక్ చేసుకుని బంధువులు, స్నేV ిాతులు థియేటర్ వద్ద భారులు తీరారు. అనుదీప్ తండ్రి విశ్వనాథం, తల్లి కాశీబాయి. వీరికి ఇద్దరు కుమా రులు, ఒక కూతురు ఉన్నారు. వీరిలో అనుదీప్ పెద్ద కుమార ుడు. జోగిపేట, నారాయణఖేడ్ ప్రాంతంలో చదువు కున్నారు. సినిమా రంగంపై ఆసక్తితో కథా రచన, డైరెక్షన్ చేయడం నేర్చుకున్నారు. డైరెక్టర్ అనుదీప్ సినిమా రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవడం తమకు గర్వంగా ఉందని, మరిన్ని విజ యాలతో ఎదగాలని బంధువులు ఆకాం క్షించారు. అనుదీ ప్‌కు బంధువులైన వెంకటేశ్, సీ.కొమరయ్య, రామచందర్ నవతెలంగాణతో మాట్లాడారు. వారి మాటల్లో... అనుదీప్ తీసిన పిట్టగోడ, జాతిరత్నాలు సక్సెస్ అయ్యాయి. మూడో సినిమా ప్రిన్స్ చాలా బాగుంది. ఒక్కొ సినిమాలో ఒక్కొ సబ్జెక్ట్ ను ఎంచుకుంటారు. ప్రేమకు కులం, మతం, ప్రాంతం అభ్యంతరాలు అనే కథాంశాలతో చాలా సినిమాలు వచ్చాయి. అనుదీప్ తీసిన ప్రిన్స్లో (హీరో) ఇండి యన్ అబ్బాయి లండన్‌కు చెందిన యువతి (హీరోయిన్)ను ప్రేమించడం, వారి ప్రేమ విషయంలో ఇరువురి తండ్రులు అభ్యంతరాలు చెప్పడమనేది సహాజమే కానీ..! వారి అభ్య ంతరం ప్రేమ పెళ్లి చేసుకోవడం కాదు. హీరో తండ్రికి బ్రిట ీష్ పాలకుల పట్ల వ్యతిరేకత ఉంటది. ఎందుకంటే ఆయన తాత బ్రిటీష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించారు. అందేకే హీరో తండ్రికి దేశాభి మానం ఎక్కువ. అదే విధంగా ఇంగ్లాండ్‌కు చెందిన హీరో యిన్ నాయనమ్మ యు ద్దం వల్ల లండన్ నుంచి ఆయా దేశా ల్లో ఆశ్రయం కోసం తి రుగుతూ ఇండియాలో ఉండి పోతుంది. ఆమెకు ఇండియా అంటే ఎంతో మక్కువ. కానీ..! ఆమె కొడుకు.. హీరోయిన్ తండ్రి ఇండియన్స్‌ను ద్వేశి స్తుంటాడు. ఈ అభిప్రా యా లతోనే వారి ప్రేమను కాదనడం కథలో కీలకాంశం. హీరో యిన్ మాత్రం నానమ్మ మాదిరే ఇండియాను ఇష్టపడుతుంది. లండన్‌కు చెందిన అమ్మాయిని ప్రేమించడం వల్ల హీరో ను (దేవరకోట) గ్రామ బహిష్కరణ చేయడంతో సిని మా మొదలెట్టి ఎందుకు అలా చేశారనేదాన్ని కథగా నడిపించారు.