Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఐడిఏబొల్లారం
బొల్లారం మున్సిపాల్టీ పరిధిలోని ఐడిఏ బస్తీలో వార్డు కౌన్సిలర్ రాధా పరశురాం వార్డు అభివృద్ధికి చర్యలు చేపట్టారు. ధ్వంసమైన రోడ్డుకు కౌన్సిలర్ రూ.20వేల సొంత నిధులతో టిీప్పర్లతో మట్టి వేయించి, జెసిబీతో చదును చేయించారు. వర్షాల కు రోడ్డుపై నీరు చేరి ప్రయాణానికి ఇబ్బందులు పడుతున్నారు. స్థానికుల సమస్య లను తెలుసుకున్న కౌన్సిలర్ ఈ మేరకు చర్యలు చేపట్టారు. రోడ్డు మరమ్మతులతో సమస్యను పరిష్కరించిన కౌన్సిలర్‌కు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. స్థానిక నాయకులు నవీన్‌రెడ్డి, కృష్ణ, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.