Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జహీరాబాద్
చట్టాల పట్ల ప్రతీ ఒక్కరికి అవగాహన కల్పించినప్పుడే నేరాల సంఖ్య తగ్గిపోతుందని సీనియర్ సివిల్ జడ్జి సూరి కృష్ణ అన్నారు. మండల లీగల్ సర్వీసెస్ కమిటీ జహీరా బాద్ ఆధ్వర్యంలో నవంబర్ 12వ తేదీన స్థానిక కోర్ట్ కాంప్లెక్స్‌లో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ మార్గం ద్వారా ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని సీనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ కె.సూరికృష్ణ , జూనియర్ సివిల్ జడ్జి జి.అనూష పోలీసు అధికారులకు సూచించారు. స్థానిక కోర్టు కాంప్లెక్స్‌లో శనివారం పోలీసు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. లోక్ అదాలత్ వల్ల కలిగే ప్రయోజనాలు బాధితులకు, కక్షిదారుల కు తెలియజెప్పి రాజిమార్గం ద్వారా కేసులు సత్వర పరిష్కారం చేసుకొని విలువైన సమయాన్ని, డబ్బుని ఆదా చేసుకునేలా చూడాలన్నారు. అపరిష్కృతంగా ఉన్న కేసుతో ఎవరైనా సతమతమౌతుంటే ఆయా మండల కేంద్రాల్లో ఉన్న న్యాయసేవా సహాయ కేంద్రాలకు గాని, స్థానిక పోలీసు అధికారులకు గాని, సంబంధిత అడ్వకేట్ ను గాని, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యాలయంను గాని సంప్రదిం చవచ్చని బాధితులకు, కక్షిదారులకు సూచించారు. బార్ ప్రెసిడెంట్ దత్తాత్రేయ రెడ్డి, బార్ వైస్ ప్రెసిడెంట్ శంకర్, బార్ సెక్రటరీ సంతోష్ కుమార్ సాగర్, న్యాయవాదులు, డీఎస్పీ రఘు, పోలీసు అధికారులు, లీగల్ సర్వీసు సిబ్బంది మరియు పారాలీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.