Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగారెడ్డి
పోలీస్ ఫ్లాగ్ డే.. అమరవీరుల సంస్మరణలో భాగంగా విధి నిర్వహణలో అసువులు బాసిన అమరవీరుల త్యాగా లను స్మరిస్తూ శనివారం సంగారెడ్డి జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో పోలీస్ కళ్యాణ మండపంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం.రమణ కుమార్ మాట్లాడుతూ.. ఈ క్యాంపులో పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది, సంగారెడ్డి పట్టణ యువకులు స్వచ్చందంగా వచ్చి రక్త దానం చేశారన్నారు. సుమారు 30 యూనిట్ల బ్లడ్‌ను సేకరించామన్నారు. ఆరోగ్యంగా ఉండే ప్రతీ ఒక్కరు రక్తదానం చేయాలని, మీరు చేసే ఈ రక్తదానం ఆపదలో ఉన్న ఎంతోమంది ప్రాణాలను రక్షించడానికి ఉపయోగపడు తుందన్నారు. ఈ బ్లడ్ డొనేషన్ లో రవీంద్రారెడ్డి డీఎస్పీ సంగారెడ్డి సిసి తిరుపతి, పిఆర్ఒ నాగరాజ్, హెల్పింగ్ హండ్స్ యూత్ అధ్యక్షులు రాహుల్, తాళ్లపల్లి గ్రామ సర్పంచ్ ప్రవీణ్, పోలీస్ సిబ్బంది మరియు తదితరులు రక్తాన్ని దానం చేసారు. రక్తదాన శిబిరంలో పాల్గొని బ్లడ్ డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి పోలీస్ శాఖ తరపున అభిన ందనలు తెలియజేస్తూ, సర్టిఫికెట్లను అందజేశారు. డా.జ్యోతి, డా.శ్రీలేఖ, బి.రవీంద్రారెడ్డి డీఎస్పీ సంగారెడ్డి, యస్బి. ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్, సంగారెడ్డి-టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్, సంగారెడ్డి-రూరల్ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, యస్.బి ఎస్ఐ యాదవరెడ్డి, ఆర్.ఐ. డానియల్, పోలీస్ సంఘం అధ్యక్షులు దుర్గారెడ్డి మరియు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంకుకు చెందిన రాజు, కమలాకర మరియు సిబ్బంది పాల్గొన్నారు.
పటాన్చెరు : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని శనివారం పటాన్చెరు మండలంలోని ఇస్నా పూర్లో గల బాలాజీ ఫంక్షన్ హాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహించిన రక్తదాన శిభిరంలో జిల్లా ఎస్పీ రమణ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 75 మంది రక్తదానం ఇచినట్టు ఆయన తెలి పారు. అనంతరం ఎస్పీ రమణ కుమార్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందుకున్నారు. పటాన్చెరు డీఎస్పీ భీమ్ రెడ్డి, సీఐలు వేణుగోపాల్ రెడ్డి, బిసన్న, వినరు రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సురేందర్ రెడ్డి, డివిజన్ స్థాయి ఎస్సైలు పాల్గొన్నారు.